BAJRANG PUNIA | స్టార్ రెజ్ల‌ర్‌కు ఆర్ధిక సాయం.. చిగురిస్తున్న ఒలింపిక్స్ ఆశ‌లు

Bajrang Punia : ప్యారిస్ ఒలింపిక్ బెర్తు కోల్పోయిన‌ భార‌త స్టార్ రెజ్ల‌ర్ భ‌జ్‌రంగ్ పూనియా(Bajrang Punia)కు ప్ర‌భుత్వం అండ‌గా నిలిచింది. ఒలింపిక్ విజేత‌కు ఆర్థిక సాయం అందించేందుకు మంగ‌ళ‌వారం కేంద్ర క్రీడా శాఖ ఆమోదం తెలిపింది. అంతేకాదు ఈ ఏడాది మే చివ‌రి వ‌ర‌కూ అత‌డి కోచ్ క‌జి కిరొన్ ముస్తాఫాను కొన‌సాగించేందుకు అంగీకరించింది.

నిరుడు రెజ్లింగ్ సమాఖ్య మాజీ ఆధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌ను వ్యతిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టిన పూనియా.. 65 కిలోల విభాగంలో త‌న ప‌ట్టు కోల్పోయాడు. ఈమ‌ధ్యే నిర్వ‌హించిన ఆసియా చాంపియ‌న్‌షిప్స్, ఆసియాన్ ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్‌లో అత‌డు టాప్ 4లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు.

భ‌జ్‌రంగ్, వినేశ్ ఫోగ‌ట్

 

రెజ్లింగ్ ట్ర‌య‌ల్స్ కోసం త‌న‌కు ఆర్ధిక సాయం చేయాలంటూ పూనియా చేసిన విజ్ఞ‌ప్తిని మిష‌న్ ఒలింపిక్ సెల్ అంగీక‌రించింది. అత‌డికి అన్ని విధాలా అండ‌గా నిలుస్తామ‌ని చెప్పింది. ఒలింపిక్స్ ట్ర‌య‌ల్స్ ముగిసే మే నెలాఖ‌రు వ‌ర‌కూ పూనియాకు సాయం చేస్తాం అని కేంద్ర క్రీడా శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. పూనియాతో పాటు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీ‌జ ఆకుల(Sreeja Akula) కూడా ఆర్ధిక సాయం కోసం క్రీడా మంత్రికి లేఖ రాసిన విష‌యం తెలిసిందే. మ‌రో వైపు మ‌హిళా రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్ 53 కిలోల విభాగంలో అద‌ర‌గొట్టింది. ఆసియా క్వాలిఫ‌య‌ర్స్‌లో ఆమె 50 కిలోల కేట‌గిరీలో బ‌రిలోకి దిగ‌నుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-03-26T12:32:18Z dg43tfdfdgfd