స్వియాటెక్‌ హ్యాట్రిక్‌

  • వరుసగా మూడో టైటిల్‌ సొంతం
  • ఫైనల్లో జాస్మిన్‌పై అలవోక విజయం
  • ప్రైజ్‌మనీ: విజేత: స్వియాటెక్‌ 21.65 కోట్లు
  • రన్నరప్‌: జాస్మిన్‌ 10.82 కోట్లు

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌తో పోలాండ్‌ భామ ఇగా స్వియాటెక్‌ ప్రేమాయణం కొనసాగుతున్నది. మట్టికోర్టులో తనకు తిరుగులేదని మరోమారు నిరూపిస్తూ స్వియాటెక్‌ ముచ్చటగా మూడోసారి ట్రోఫీకి ఫ్రెంచ్‌ కిస్‌ ఇచ్చింది. టోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకుసాగిన స్వియాటెక్‌..టైటిల్‌ ఫైట్‌లో ఇటలీ బ్యూటీ జాస్మిన్‌ పౌలినిపై అలవోక విజయం సాధించింది. కోర్టులో పాదరసంలా కదులుతూ వరుస సెట్లలో జాస్మిన్‌ను చిత్తుచేసి గత ఐదేండ్లలో నాలుగోసారి ఫ్రెంచ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకుని కొత్త చరిత్ర లిఖించింది.

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పోలాండ్‌ స్టార్‌ ఇగా స్వియాటెక్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. ఫెవరేట్‌ హోదాకు న్యాయం చేస్తూ శనివారం పూర్తి ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో టాప్‌సీడ్‌ స్వియాటెక్‌ 6-2, 6-1తో జాస్మిన్‌ పౌలిని(ఇటలీ)పై అద్భుత విజయం సాధించింది. ఫిలిపి చాట్రియర్‌ స్టేడియం వేదికగా గంటా ఎనిమిది నిమిషాల పాటు సాగిన పో రులో స్వియాటెక్‌ తనదైన ఆధిపత్యం ప్రదర్శించింది. మట్టికోర్టులో తన అనుభవాన్ని ఉపయోగిస్తూ స్వి యాటెక్‌..వరుస సెట్లలో 12వ సీడ్‌ జాస్మిన్‌ను చిత్తుచేసింది. స్వియాటెక్‌ 18 విన్నర్లు కొట్టగా, జాస్మిన్‌ 7కు పరిమితమైంది. 21 సార్లు అనవసర తప్పిదాలకు పాల్పడటం జాస్మిన్‌ కొంపముంచింది.

21 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్వియాటెక్‌ వరుసగా సాధించిన విజయాలు. ఓపెన్‌ ఎరాలో ఇదినాలుగో సుదీర్ఘ విజయాల రికార్డు

3 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్వియాటెక్‌(4) కంటే ముగ్గురు ప్లేయర్లు క్రిస్‌ ఎవర్ట్‌(7), స్టెఫీగ్రాఫ్‌ (6), హెనిన్‌(4) ఎక్కువ టైటిళ్లు సాధించారు.

2024-06-08T21:31:34Z dg43tfdfdgfd