మిల్లర్‌ ధనాధన్‌

  • నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా గెలుపు

న్యూయార్క్‌: టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా చెమటోడ్చి గెలిచింది. శనివారం నసావు స్టేడియం వేదికగా జరిగిన గ్రూపు-డి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. డచ్‌ టీమ్‌ నిర్దేశించిన 104 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనను 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సఫారీలు 106 పరుగులు చేశారు.

12 పరుగులకే హెండ్రిక్స్‌(3), డికాక్‌(0), కెప్టెన్‌ మార్క్మ్‌(్ర0), క్లాసెన్‌(4) వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను డేవిడ్‌ మిల్లర్‌(51 బంతుల్లో 59 నాటౌట్‌, 3ఫోర్లు, 4సిక్స్‌లు), స్టబ్స్‌(33) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 72 బంతుల్లో 65 పరుగులు జోడించారు. అనూహ్యంగా స్పందిస్తున్న నసావు పిచ్‌పై డచ్‌ బౌలింగ్‌ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ మిల్లర్‌ బాధ్యాతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బార్ట్‌మన్‌ (4/11), జాన్సెన్‌(2/20), నోకియా (2/19) విజృంభణతో నెదర్లాండ్స్‌ 103/9 స్కోరుకు పరిమితమైంది. సైబ్రాండ్‌(40), వాన్‌బీక్‌ (23) ఫర్వాలేదనిపించారు. మిల్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

2024-06-08T20:46:27Z dg43tfdfdgfd