బంగ్లా భళా

  • శ్రీలంకపై ఉత్కంఠ విజయం

డల్లాస్‌: టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన గ్రూపు-డి మ్యాచ్‌లో శ్రీలంకపై 2 వికెట్ల తేడాతో బంగ్లా ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యఛేదనలో 8 వికెట్లు కోల్పోయిన బంగ్లా 19వ ఓవర్లో విజయాన్నందుకుంది. నువాన్‌ తుషార(4/18), హసరంగ(2/32) ధాటికి ఒక దశలో ఓటమి కోరల్లో చిక్కుకున్న బంగ్లాను తౌహిద్‌ హృదయ్‌(40), లిటన్‌దాస్‌(36) ఆదుకున్నారు.

మొదట 6 పరుగులకే తంజిద్‌ హసన్‌(3), సౌమ్యసర్కార్‌(0), కెప్టెన్‌ నజ్ముల్‌(7) వికెట్లు కోల్పోయిన బంగ్లా తౌహిద్‌, లిటన్‌ గట్టెక్కించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 38 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే 22 పరుగుల తేడాతో బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో మహ్మదుల్లా జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. అంతకుముందు నిస్సనక(47), డిసిల్వా(21) రాణించడంతో లంక 20 ఓవర్లలో 124/9 స్కోరు చేసింది. ముస్తాఫిజుర్‌(3/17), రిషాద్‌ హుస్సేన్‌ (3/22) విజృంభణతో లంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కుశాల్‌మెండిస్‌(4), కెప్టెన్‌ హసరంగ(0) ఘోరంగా విఫలమయ్యారు. మూడు వికెట్లు పడగొట్టిన రిషాద్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

2024-06-08T21:01:30Z dg43tfdfdgfd