జాతీయ రేసింగ్‌ చాంప్‌ అతికా

బెంగళూరు: ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఐ జాతీయ కార్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ రేసర్‌ అతికా మిర్‌ విజేతగా నిలిచింది. 7 నుంచి 12 ఏండ్ల వయసు విభాగంలో టీమ్‌ ఎమ్‌స్పోర్ట్‌ రేసింగ్‌ తరఫున తొలిసారి పోటీకి దిగిన అతికా పోడియం ఫినిష్‌తో టైటిల్‌ దక్కించుకుంది.

చాంపియన్‌షిప్‌లో ఐదు రౌం డ్లలో పోటీపడటం అతికాకు ఇది మొదటిసారి అని తండ్రి ఆసిఫ్‌ మిర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం అతికా దుబాయ్‌లో గిబ్బన్స్‌ దగ్గర శిక్షణ పొందుతున్నది.

2024-06-07T20:27:33Z dg43tfdfdgfd