అన్షుమాలిక్‌ రజత పట్టు

బుడాపెస్ట్‌: బుడాపెస్ట్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో భారత యువ రెజ్లర్‌ అన్షుమాలిక్‌ రజత పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల 57కిలోల ఫైనల్‌ బౌట్‌లో బరిలోకి దిగిన అన్షుమాలిక్‌ 1-12 తేడాతో కెగ్జిన్‌హాంగ్‌(చైనా) చేతిలో ఓటమిపాలై రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచ నంబర్‌వన్‌ చైనా రెజ్లర్‌కు మాలిక్‌ దీటైన పోటీనివ్వడంలో విఫలమైంది. ఆసియాగేమ్స్‌(హంగ్జు) కాంస్య విజేత అయిన కెగ్జిన్‌హాంగ్‌..మాలిక్‌పై పూర్తిపట్టు సాధిస్తూ బౌట్‌ను తన వశం చేసుకుంది. మరోవైపు మహిళల 53కిలోల విభాగంలో అంతిమ్‌ పంగల్‌ 0-4 తేడాతో ఎమ్మాజోనా డెనైస్‌(స్వీడన్‌) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.

2024-06-08T20:46:27Z dg43tfdfdgfd