స్పోర్ట్స్

Trending:


ఆటకు గుడ్‌బై చెప్పాక.. మళ్లీ మీకు కనిపించను.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా రన్ మెషీన్.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఆట నుంచి తప్పుకున్న తర్వాత సుదీర్ఘ కాలం ఎవరికీ కన్పించబోనని వెల్లడించాడు. పశ్చాత్తాపానికి ఆస్కారం లేకుండా ఆటను ఆస్వాదిస్తానని విరాట్ చెప్పుకొచ్చాడు. రిటైరయ్యాక విరాట్ కోహ్లి విదేశాల్లో ఎక్కువ కాలం గడుపుతాడని ప్రచారం జరుగుతోన్న వేళ.. క్రికెటర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.


Hardik Pandya: ఇష్టంలేకున్నా హార్ధిక్ పాండ్యాను టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేశారా?

Hardik Pandya: అమెరికాలో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు .. హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్ పాత్ర‌లో ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. కానీ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా ఆడుతున్న హార్దిక్ విష‌యంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ విముఖ‌త‌తో ఉన్న‌ట్లు తెలిసింది.


IPL 2024: 7 మ్యాచ్‌లు, 3 బెర్తులు.. ఆసక్తికరంగా ప్లే ఆఫ్స్ రేసు..!

IPL Points Table: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. లీగ్ దశలో ఇంకా ఏడు మ్యాచులు జరగాల్సి ఉండగా.. మిగిలిన మూడు ప్లేసుల కోసం ఏకంగా ఆరు జట్ల పోటీ పడుతున్నాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ముందంజలో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సైతం అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.


మనికా @ 24

ఇటీవలే ముగిసిన సౌదీ స్మాష్‌ టోర్నమెంట్‌లో సంచలన ప్రదర్శనలతో మెరిసిన భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ మనికా బాత్ర మరో ఘనత సాధించింది. అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ (ఐటీటీఎఫ్‌) మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆమె 24వ ర్యాంకుకు దూసుకెళ్లింది.


హెచ్‌సీఏ ఎథిక్స్‌ అధికారిగా జస్టిస్‌ ఈశ్వరయ్య

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఎథిక్స్‌ అధికారిగా ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ఎన్‌సీబీసీ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య బాధ్యతలు స్వీకరించారు.


రూ.400 కోట్ల లాభం వస్తుంటే అరవాల్సిన అవసరమేంటి?.. లక్నో యజమానిపై సెహ్వాగ్ ఆగ్రహం

Lucknow Super Giants Owner Sanjiv Goenka: సన్ రైజర్స్ హైదరాబాద్‌‌తో మ్యాచులో ఓటమి అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా.. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో ప్రవర్తించిన తీరుపై టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పుకొచ్చాడు. రూ.400 కోట్ల లాభం వస్తున్నప్పుడు ఆటగాళ్లపై అరవాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించాడు. సెహ్వగ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.


‘టాప్స్‌’లోకి స్కాష్‌ ప్లేయర్లు

భారత యువ స్కాష్‌ ప్లేయర్లు అన్హత్‌ సింగ్‌, అభయ్‌ సింగ్‌, వెలవన్‌ సెంథిల్‌కుమార్‌ టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లోకి వచ్చారు.


GT vs KKR IPL 2024: వర్షంతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌ నుంచి గుజరాత్ టైటాన్స్ ఔట్

ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచి.. రెండో సీజన్‌లో ఫైనల్ వరకూ వచ్చిన గుజరాత్ టైటాన్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టాప్-2 ప్లేసును ఖరారు చేసుకుంది.


IPL 2024 DC vs LSG: లక్నోను ఓడించిన ఢిల్లీ.. ప్లేఆఫ్స్‌ నుంచి రెండూ ఔట్!

Delhi Capitals: ఐపీఎల్‌ 2024లో తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయంతో ముగించింది. మంగళవారం ఢిల్లీ వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితంతో టోర్నీలో ఏడో విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది. అయినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ చేరడం దాదాపుగా అసాధ్యం. ఇక వరుసగా మూడో మ్యాచులో ఓడిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.


పర్వేజ్‌ ఖాన్‌కు స్వర్ణం

భారత యువ అథ్లెట్‌ పర్వేజ్‌ ఖాన్‌ ఫ్లోరిడావేదికగా జరుగుతున్న సౌత్‌ఈస్ట్రన్‌ కాన్ఫరెన్స్‌ ఔట్‌డోర్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు.


'ధోనీ గాడ్ ఆఫ్ ది చెన్నై'.. అతడి కోసం గుళ్లు కడతారు: సీఎస్కే మాజీ ప్లేయర్

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీకి ఉండే క్రేజే వేరు. చెన్నైలో అతడికి ఫ్యాన్స్ కాదు.. ఏకంగా భక్తులే ఉంటారు. తన సారథ్యంలో సీఎస్కేను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ.. చెన్నై ఫ్యాన్స్ అభిమానాన్ని చూరగొన్నాడు. ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ భావిస్తాడని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీ కోసం చెన్నై ఫ్యాన్స్ గుళ్లు కడతారని.. సీఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు. ధోనీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.


సన్ రైజర్స్‌కు గోల్డెన్ ఛాన్స్..! 2 మ్యాచుల్లో గెలిస్తే టాప్-2 ఫిక్స్..!

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. భారీ రన్ రేట్‌తో గెలిచి.. టాప్-2లో నిలవాలనే పట్టుదలతో ఆ జట్టు ఉంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన గుజరాత్ టైటాన్స్.. విజయంతో సీజన్‌ను ముగించాలని భావిస్తోంది.


SRH Vs GT Dream11 Team: నేడు గుజరాత్‌తో సన్‌రైజర్స్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇలా..!

Sunrisers Hyderabad Vs Gujarat Titans Indians Playing XI Dream11 Team Tips: ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ రెడీ అవుతోంది. సొంతగడ్డపై నేడు గుజరాత్ టైటాన్స్‌ను ఓడిస్తే టాప్-4లో నిలుస్తుంది. హెడ్ టు హెడ్ రికార్డు, డ్రీమ్11 టిప్స్ ఇలా..


IPL 2024 RR vs PBKS: సామ్‌ కరాన్‌ పోరాటంతో పంజాబ్‌కు విజయం.. రాజస్థాన్‌ రాయల్స్‌ నాలుగో ఓటమి

IPL 2024 RR vs PBKS Punjab Kings Won By 5 Wickets Against Rajasthan Royals​: పేలవ ప్రదర్శనతో అతి తక్కువ విజయాలతో మొదట ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన పంజాబ్‌ కింగ్స్‌కు భారీ ఊరట లభించింది. సామ్‌ కరాన్‌ గొప్ప పోరాటంతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది.


ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ఫ్లేఆఫ్స్‌కు SRH, ఆ ఒక్కటీ జరిగితే ఫైనల్‌కు ఈజీగా!

Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - గుజరాత్‌ టైటాన్స్‌ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. హైదరాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్‌ నిర్వహించే పరిస్థితి లేదని అంపైర్లు తేల్చేశారు. మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించారు. ఫలితంగా 15 పాయింట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ IPL 2024 ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది.


T20 World Cup 2024 | శాంటోకు సార‌థ్యం.. మాజీ కెప్టెన్‌కు ఆఖ‌రి చాన్స్

T20 World Cup 2024 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీకి కౌంట్‌డౌన్ మొద‌ల‌వ్వ‌డంతో బంగ్లాదేశ్ క్రికెట్(Bangladesh Cricket) బోర్డు తుది స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది. న‌జ్ముల్ హుసేన్ శాంటో(Najmul Hussain Shanto) కెప్టెన్‌గా, సీనియ‌ర్ పేస‌ర్ త‌స్కిన్ అహ్మ‌ద్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యారు.


IPL 2024 SRH vs GT: హైదరాబాద్‌కు కలిసొచ్చిన అదృష్టం.. గుజరాత్‌ మ్యాచ్‌ రద్దుతో ప్లేఆఫ్స్‌లోకి సన్‌రైజర్స్‌

IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు వరుణుడి రూపంలో అదృష్టం కలిసొచ్చింది. వర్షం కారణంగా గుజరాత్‌తో మ్యాచ్‌ రద్దవడంతో ఒక పాయింట్‌ పొందిన హైదరాబాద్‌ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.


RCB vs DC IPL 2024: వరుసగా ఐదో విజయం.. ప్లే ఆఫ్స్ దిశగా దూసుకెళ్తున్న ఆర్సీబీ..!

DC vs RCB: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ దిశగా ఆర్సీబీ మరో అడుగు ముందుకేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో 47 రన్స్ తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో ఐదో ప్లేసుకు ఎగబాకింది. ఈ సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ.. చివరి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడిస్తే ముందంజ వేసే అవకాశం ఉంది. ఈ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.


Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో సంచలనం, ఆప్ పార్టీపై కేసు నమోదు

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఇప్పట్లో తేలేలా కన్పించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కూడా కేసుల ప్రక్రియ ఆగలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇంకా కేసులు నమోదు చేస్తూనే ఉంది. అలాంటిదే ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.


MS Dhoni: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ..? ముందు ఆ రూల్ పాటించాల్సిందే..!

MS Dhoni Team India Head Coach: రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. ఎంఎస్ ధోనీని కోచ్‌గా నియమిస్తారని రూమర్లు వస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది కుదరని పని. ధోనీ కోచ్ కావాలంటే చెన్నై జట్టుకు గుడ్‌బై చెప్పాల్సి ఉంటుంది.


ఢిల్లీ ఔట్‌

ఐపీఎల్‌-17 ప్లేఆఫ్స్‌ రేసులో ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తప్పటడుగులు వేసి తగిన మూల్యం చెల్లించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. 47 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది.


కేఎల్ రాహుల్ మళ్లీ ఆర్సీబీలోకి వెళ్తాడా? తెరమీదకు కొత్త డిమాండ్..!

KL Rahul RCB: లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. వచ్చే సీజన్‌కు ముందు ఆర్సీబీకి తిరిగి వచ్చేయాలని కూరుకుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచులో స్టేడియంలో ప్లకార్డులు ప్రదర్శించారు. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్.. సొంత టీమ్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చేయాలని అభ్యర్థిస్తున్నారు.


Esha Singh | పారిస్‌ ఒలింపిక్స్‌కు హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌

హైదరాబాదీ షూటర్‌ ఇషా సింగ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును దక్కించుకుంది. భోపాల్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో భాగంగా మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ టీ4లో భారత స్టార్‌ షూటర్‌ మనూ భాకర్‌ 586 స్కోరు చేయగా ఇషా సైతం 586 పాయింట్లతో టాప్‌-2లో నిలిచి పారిస్‌ కోటాను ఖాయం చేసుకున్నారు.


ఢిల్లీ పోతూ పోతూ

ఐపీఎల్‌-17లో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. పోతూ పోతూ లక్నో సూపర్‌ జెయింట్స్‌ను కూడా వెంట తీసుకెళ్లింది. గత ఆదివారమే బెంగళూరుతో మ్యాచ్‌లో ఓడి ప్లేఆఫ్స్‌ రేసునుంచి అనధికారికంగా తప్పుకున్న క్యాపిటల్స్‌.. మంగళవారం రాత్రి అరుణ్‌ జైట్లీ స్టేడియంలో లక్నో అవకాశాలపైనా దెబ్బకొట్టింది.


Impact Player: ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌పై చ‌ర్చ‌.. ర‌విశాస్త్రి, అశ్విన్ మ‌ద్ద‌తు

Impact Player rule: మాజీ కోచ్ ర‌విశాస్త్రి, స్పిన్న‌ర్ అశ్విన్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌ను స‌మ‌ర్థించారు. ఇంపాక్ల్ ప్లేయ‌ర్లు ఉండ‌డం వ‌ల్ల మ్యాచ్‌ల‌ను చాలా క్లోజ్‌గా ఫినిష్ చేయ‌వ‌చ్చు అన్న అభిప్రాయాల్ని వ్య‌క్తం చేశారు. కాలంతో పాటు గేమ్‌లో మార్పులు ఉంటాయ‌ని, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ మంచిదే అని, ఇత‌ర క్రీడ‌ల్లోనూ మార్పులు జ‌రుగుతున్నాయ‌ని, ఈ రూల్ వ‌ల్ల మ్యాచులు చాలా టైట్‌గా ఫినిష్ అవుతున్న‌ట్లు శాస్త్రి తెలిపారు.


Ireland vs Pakistan: ఐర్లాండ్‌పై సిరీస్ గెలిచిన పాకిస్థాన్.. అంతా టాస్ మహిమ!

Ireland vs Pakistan: పొట్టి ప్రపంచ కప్‌ ముందు ప్రాక్టీస్‌కు పనికొస్తుందనే ఉద్దేశంతో పాకిస్థాన్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఐరిష్ టీమ్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడిన పాక్.. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ, మిగతా రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్ గెలుచుకుంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే గెలుపొందడం గమనార్హం. చివరి టీ20లో రిజ్వాన్, బాబర్ హాఫ్ సెంచరీలు బాదడంతో పాకిస్థాన్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది.


IPL | రేసు రసవత్తరం!.. కీలక దశకు చేరినా ఖరారు కాని ప్లేఆఫ్స్‌ బెర్తులు

నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌-17) కీలక దశకు చేరుకుంది. లీగ్‌ స్టేజీలో ఏడు మ్యాచ్‌లే మిగిలున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) మాత్రమే అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారుచేసుకుంది.


ఇస్తాంబుల్‌లోనూ అదే కథ

వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలోనూ భారత రెజ్లర్ల వైఫల్య ప్రదర్శన కొనసాగింది. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తులను నిర్ణయించే ఈ టోర్నీలో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు ఫ్రీస్టయిల్‌ రెజ్లరూ ఓడారు.


ఆర్సీబీ అంటార్రా బాబు.. వాట్ ఏ కమ్‌బ్యాక్.. అట్టడుగు నుంచి ఐదో స్థానానికి..!

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో ప్లేసుకు చేరింది. ఈ సీజన్‌లో తొలి 8 మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా ఐదింట్లో గెలుపొందింది. పది రోజుల వ్యవధిలోనే పాయింట్ల పట్టికలో పదో ప్లేసు నుంచి ఐదో స్థానానికి వచ్చింది. లీగ్ దశలో చివరి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనున్న ఆర్సీబీ.. అందులో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.


RR Vs PBKS Dream11 Team: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..

Rajasthan Royals Vs Punjab Kings Indians Playing XI Dream11 Team Tips: ప్లే ఆఫ్స్ ముంగిట రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య బుధవారం పోరు జరగనుంది. టాప్-4లో అధికారికంగా అడుగుపెట్టేందుకు రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో నెగ్గాల్సి ఉండగా.. పరువు నిలబెట్టుకునేందుకు పంజాబ్ పోరాడుతోంది.


IPL 2024 | రాహుల్‌ను హ‌త్తుకున్న‌ గొయెంకా.. వివాదం ముగిసిన‌ట్టేనా..?

IPL 2024 : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) కీల‌క మ్యాచ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ స‌మ‌యంలో ల‌క్నో ఫ్రాంచైజీ య‌జ‌మాని సంజీవ్ గొయెంకా(Sanjiv Goenka), కెప్టెన్ రాహుల్(KL Rahul) ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది.


గుజరాత్ టైటాన్స్ ఓటములకు అదే కారణం: మహమ్మద్ షమీ

ఐపీఎల్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచి.. రెండో సీజన్‌లో ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో లీగ్ స్టేజ్ దాటకుండానే ఇంటిబాట పట్టింది. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచు వర్షం కారణంగా రద్దు కావడంతో జీటీ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే ఈ సీజన్‌లో గుజరాత్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. అందుకు గల కారణాలను వివరించాడు.


సునీల్ ఛెత్రి రిటైర్మెంట్.. ఫుట్‌బాల్ దిగ్గజం భావోద్వేగం, హైదరాబాద్‌తో అనుబంధం ఇదే

Sunil Chhetri: క్రికెట్‌ను మతంలా ఆరాధించే భారత్‌లో ఫుట్‌బాల్‌కు గుర్తింపు తీసుకొచ్చిన ఆటగాడు సునీల్ ఛెత్రి. 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ చేసి.. అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఫుట్‌బాల్ దిగ్గజాలు రోనాల్డొ, మెస్సీ మాత్రమే ఛెత్రి కంటే ముందున్నారు. అలాంటి సునీల్ ఛెత్రి ఆటకు వీడ్కోలు పలికాడు. జూన్ 6న కువైట్‌తో జరిగే ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించాడు. సునీల్ ఛెత్రి కెరీర్, కుటుంబం గురించి కీలక...


దీక్ష సరికొత్త రికార్డు

భారత ట్రాక్‌ అథ్లెట్‌ కెఎం దీక్ష మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది. లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా జరుగుతున్న సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ ఫెస్ట్‌లో భాగంగా శనివారం ముగిసిన ఫైనల్‌ రేసును 4:4.78 నిమిషాలలో పూర్తిచేసిన దీక్ష మూడో స్థానంలో నిలిచింది.


Gujarat Titans | టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. టాస్‌ కూడా పడకుండానే గుజరాత్‌-కోల్‌కతా మ్యాచ్‌ రద్దు

నిండు వేసవిలో అహ్మదాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షం.. ఐపీఎల్‌లో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లింది. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వరుణుడి అంతరాయంతో టాస్‌ పడకుండానే రద్దయ్యింది.


చెన్నై సేఫ్‌

ఐపీఎల్‌-17లో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌ కింగ్స్‌.. ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచేందుకు రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన అత్యంత కీలకమ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది.


Kylian Mbappe | పీఎస్‌జీకి చివరి హోం గేమ్‌ ఆడిన ఎంబాపె

ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ ఫ్రాంచైజీ పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ (పీఎస్‌జీ)తో ఏడేండ్ల బంధాన్ని త్వరలో తెంచుకోనున్న ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ యువ సంచలనం కిలియన్‌ ఎంబాపె.. ఆ జట్టు తరఫున చివరి హోమ్‌ గేమ్‌ ఆడేశాడు.


KKR vs MI: ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఇదేం పాడు పనిరా బాబూ.. పోలీసుకు దొరికిపోయాడుగా..!

Kolkata Knight Riders Mumbai Indians Match: ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 11న జరిగిన మ్యాచులో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచు బంతిని ఎత్తుకెళ్లేందుకు ఓ ఫ్యాన్ ప్రయత్నించాడు. ప్యాంటు జేబులో బంతిని దాచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు గమనించాడు. దీంతో కేకేఆర్ ఫ్యాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది.


IPL | ఐపీఎల్‌ను వీడుతున్న ఇంగ్లండ్‌ క్రికెటర్లు.. ఎందుకంటే?

మార్చి మాసాంతం నుంచి జరుగుతున్న ఐపీఎల్‌-17లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వీడ్కోలు పలుకుతున్నారు. త్వరలో మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌.. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఈ సీజన్‌కు గుడ్‌బై చెబుతున్నారు.


DC vs LSG | హాఫ్ సెంచ‌రీల‌తో విరుచుకుప‌డ్డ స్ట‌బ్స్, పొరెల్.. ల‌క్నో ముందు పెద్ద ల‌క్ష్యం..!

DC vs LSG : చావోరేవో పోరులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్లు శివాలెత్తారు. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(0) సున్నాకే ఔటైనా.. యువ‌కెర‌టాలు అభిషేక్ పొరెల్(58), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్(57 నాటౌట్‌)లు హాఫ్ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టారు. దాంతో, ఢిల్లీ కీల‌క పోరులో రెండొంద‌ల‌కు పైగా కొట్టింది.


RCB vs DC | ఆ న‌లుగురు ఔట్.. మిడిలార్డ‌ర్‌పైనే ఢిల్లీ ఆశ‌ల‌న్నీ

RCB vs DC : భారీ ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. చిన్న‌స్వామి స్టేడియంలో ఆర్సీబీ బౌలర్ల విజృంభ‌ణ‌తో ప‌వ‌ర్ ప్లేలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఒక‌రి వెన‌కు ఒక‌ర‌కు డ‌గౌట్‌కు క్యూ క‌డుతున్నారు.


Nikhat Zareen | ఎలోర్డ కప్‌.. నిఖత్‌ తొలి పంచ్‌ అదుర్స్‌

పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు అస్తానా (కజకిస్థాన్‌) వేదికగా జరుగుతున్న ఎలోర్డ కప్‌లో వరల్డ్‌ చాంపియన్‌, తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తొలిరౌండ్‌లో అదరగొట్టింది. సోమవారం జరిగిన మొదటి రౌండ్‌లో నిఖత్‌ (52 కిలోల విభాగంలో).. 5-0 తేడాతో రఖైంబెర్డి జన్సాయాను ఓడించింది.


RR vs PBKS: రాజస్థాన్‌ను చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్.. సన్‌రైజర్స్‌కు లక్కీ ఛాన్స్..!

ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకొని.. జోస్ బట్లర్ ఇంగ్లాండ్ వెళ్లిపోవడంతో అతడి స్థానంలో కొత్త కుర్రాడితో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు పంజాబ్ చేతిలో ఓటమి ఎదురైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టులో పరాగ్, అశ్విన్ మాత్రమే బ్యాట్‌తో రాణించారు. ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన పంజాబ్.. ఐదు వికెట్ల తేడాతో రాయల్స్‌ను ఓడించింది. కెప్టెన్ సామ్ కర్రన్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో పంజాబ్‌ను గెలిపించి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి...


DC vs LSG | పూరన్, అర్షద్ ఖాన్ పోరాడినా.. ఢిల్లీ పంచ్‌కు ల‌క్నో ఢ‌మాల్

DC vs LSG : ప్లే ఆఫ్స్‌లో నిల‌వాలంటే గెల‌వ‌క త‌ప్ప‌ని మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్(Delhi Capitals) త‌డాఖా చూపించింది. సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన‌ చావోరేవో పోరులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌(LSG)ను చిత్తుగా ఓడించింది. ఆఖ‌రి ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లో అద్భుత విజ‌యంతో రెండు కీల‌క పాయింట్లు సాధించింది.


RCB: అనుష్క శర్మ ఆనందం చూశారా.. మజిల్స్ చూపిస్తూ కోహ్లీ సంబరం

Anushka Sharma: ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా ఐదో విజయం నమోదు చేసిన అనంతరం విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సెలబ్రేట్ చేసుకున్నారు. విజయం ఖరారు కాగానే ఎగిరి గంతేశారు. కోహ్లీ సైతం గెలుపు సంకేతాలను తన భార్యకు అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడంతో ఆనందం కట్టలు తెంచుకుంది.


RCB vs DC | స్ట‌బ్స్ ర‌నౌట్.. పోరాడుతున్న అక్ష‌ర్ ప‌టేల్

RCB vs DC: భారీ ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూ ఓట‌మి అంచున నిలిచింది. ఫామ్‌లో ఉన్న ట్రిస్ట‌న్ స్ట‌బ్స్(3) అనూహ్యంగా ర‌నౌట‌య్యాడు.


Sean Williams | టీ20 క్రికెట్‌కు స్టార్‌ ఆల్‌రౌండర్‌ సీన్‌ విలియమ్స్‌ గుడ్‌బై..

Sean Williams | జింబాబ్వే స్టార్‌ ఆల్‌రౌండర్‌ సీన్‌ విలియమ్స్‌ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే, టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు ఆల్‌ రౌండర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద షాకింగ్‌ వార్తే. జూన్‌ 2న టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే.


ఐపీఎల్‌లో స్టార్క్.. ఏపీఎల్‌లో నితీశ్ రెడ్డి.. జాక్‌పాట్ కొట్టిన తెలుగు కుర్రాడు..!

Andhra Premier League Auction: తెలుగు క్రికెటర్, ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి జాక్‌పాట్ కొట్టాడు. ఐపీఎల్‌లో ఆల్ రౌండర్‌గా సత్తాచాటుతున్న 20 ఏళ్ల నితీశ్.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్-3 కోసం జరిగిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. గురువారం విశాఖలో జరిగిన ఈ వేలంలో గోదావరి టైటాన్స్ జట్టు అతడిని రూ.15.60 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు అతడిని రూ.20 లక్షలకు సొంతం చేసుకోవడం గమనార్హం.


IPL 2024: కీలక మ్యాచ్‌లకు ముందు జట్లకు షాక్.. వెళ్లిపోతున్న ఇంగ్లాండ్ ప్లేయర్లు..!

ఐపీఎల్ 2024 ముగింపు దశకు చేరుకున్న వేళ.. ఇంగ్లాండ్ ప్లేయర్లు పలు ఫ్రాంఛైజీలకు షాక్ ఇస్తున్నారు. పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడేందుకు తప్పనిసరిగా రావాలని ఈసీబీ ఆదేశించడంతో ఐపీఎల్‌ను వీడి ఇంగ్లాండ్‌కు పయనమవుతున్నారు. ఇందులో జాస్ బట్లర్, విల్ జాక్స్, మొయిన్ అలీ, రీస్ టాప్లే వంటి ప్లేయర్లు ఉన్నారు. ప్లే ఆఫ్స్ దశ సమీపిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్లేయర్ల సేవలు కోల్పోవడం ఆయా జట్లకు ఇబ్బంది కరంగా మారింది.


DC vs LSG | అక్ష‌ర్ ప‌టేల్ డైవింగ్ క్యాచ్.. ఓట‌మి అంచుల్లో ల‌క్నో..!

DC vs LSG : ఢిల్లీ బౌల‌ర్లపై విరుచుకుప‌డిన ల‌క్నో చిచ్చ‌ర‌పిడుగు నికోల‌స్ పూర‌న్(61) అర్ద శ‌త‌కం బాదాడు. 71 ప‌రుగులకే స‌గం వికెట్లు ప‌డిన వేళ ల‌క్నోకు భారీ ఓట‌మి త‌ప్పించే ప్ర‌య‌త్నం చేశాడు.