ప్రపంచ క్రికెట్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరొందిన జోష్ హేజెల్‌వుడ్ ఇప్పుడు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన హేజెల్‌వుడ్ ఇప్పుడు ఆస్ట్రేలియా డెన్‌లో కనిపించాడు. ఈ నెల 11 నుంచి ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లోనే తమ తమ దేశాలకు వెళ్లగా.. హేజెల్‌వుడ్‌ని మాత్రం ఆర్సీబీ పట్టుబట్టి మరీ తీసుకొచ్చింది. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన సమయంలో హేజెల్‌వుడ్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అయితే, మళ్లీ తిరిగి రాడని అందరూ అనుకున్నప్పటికీ.. ఆర్సీబీ మేనేజ్‌మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతితో వెనక్కి తీసుకొచ్చింది.
జోష్ హేజెల్‌వుడ్ ఇప్పుడు క్రికెట్‌లో లక్కీ ఛార్మ్‌గా మారాడు. హేజెల్‌వుడ్ ఫైనల్స్‌లో ఆడిన అన్ని పెద్ద ఈవెంట్లలో టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. 2012 నుంచి 2025 ఐపీఎల్ వరకు ఏడు సార్లు హేజెల్‌వుడ్ ఉన్న జట్టు ఫైనల్స్‌కు చేరుకోగా.. ఏడింటిలోనూ ట్రోఫీ అందుకుంది. తొలిసారి 2012లో ఛాంపియన్స్ లీగ్ టీ20లో విజేతగా నిలవగా.. 2015 వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలవగా, 2020లో బిగ్‌బాష్ లీగ్, 2021 ఐపీఎల్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2025 ఐపీఎల్‌లో ఆర్సీబీ విజేతగా నిలిచింది.
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో గాయంతో సిరీస్‌కు దూరమైన హేజెల్‌వుడ్ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా ఆడలేదు. ఐపీఎల్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన హేజెల్‌వుడ్ ఇప్పుడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడు. సౌతాఫ్రికాతో ఈ నెల 11 నుంచి జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్‌లో ఎలాంటి ప్రభావం చూపుతాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.