WTC FINALకి అంతా సిద్ధం.. సౌతాఫ్రికా కల నెరవేరేనా?
![]()
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 ఫైనల్‌కి మరొక్క రోజే మిగిలి ఉంది. జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ మైదానం వేదికగా సౌతాఫ్రికా - ఆస్ట్రేలియా జట్లు ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనున్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక వరుసగా రెండోసారి ఫైనల్‌కి చేరిన ఆస్ట్రేలియా.. ఈసారి కూడా టైటిల్ తీసుకెళ్లాలని చూస్తోంది.
2023-25 సంవత్సరానికి సంబంధించి జరిగిన టెస్టు మ్యాచ్‌లలో ఏ జట్టయినా ఎక్కువ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంటుందో అది ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ సీజన్‌లో సౌతాఫ్రికా వరుస విజయాలతో మొదటి స్థానంలో నిలవగా, బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లు జూన్ 11న క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ వేదికగా తలపడనున్నాయి.
సఫారీలకు మంచి అవకాశం
ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ సౌతాఫ్రికా టీమ్‌కి ఒక మంచి అవకాశం. టెస్టుల్లో మంచి ఫామ్‌లో ఉన్న సఫారీలు ఈ సారి ఎలాగైనా ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని చూస్తున్నారు. వరుసగా ఏడు టెస్టులను గెలిచిన సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్‌ను సొంతం చేసుకుని చరిత్ర తిరగరాయాలని చూస్తోంది. గతేడాది జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చివర్లో తడబడిన దక్షిణాఫ్రికా జట్టు ఛాంపియన్స్‌గా నిలిచే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.
స్ట్రాంగ్ బౌలింగ్‌తో కంగారులు
ప్యాట్ కమిన్స్, జోష్ హేజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్ లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్‌తో ఆస్ట్రేలియా జట్టు చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో కూడా ఖ్వాజా, స్మిత్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్‌లతో టఫ్ ఫైట్ ఇవ్వనున్నారు. అలెక్స్ క్యారీ, జాస్ ఇంగ్లిస్ కూడా మంచి ఫామ్‌లో ఉండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.
ఈ రెండు జట్ల మధ్య లార్డ్స్‌లో హోరాహోరీ పోరీ జరగనుండటం ఖాయమని తెలుస్తోంది. సౌతాఫ్రికా కూడా కగిసో రబడా, లుంగీ ఎంగిడి, మార్కో యాన్సన్ లాంటి పేసర్లతో స్ట్రాంగ్‌గానే ఉంది. ఇక కేశవ్ మహారాజ్ స్పిన్ మ్యాజిక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. టెంబా బవుమా, టోనీ డిజోరీ, ఎయిడెన్ మర్కరమ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్‌తో బ్యాటింగ్ లైనప్ కూడా ఆసీస్‌కు దీటుగానే బదులివ్వనుంది. మరి ఈ హోరాహోరీ పోరులో చోకర్స్ పేరును చెరిపేసి సఫారీలు ఛాంపియన్స్‌గా నిలుస్తారా? లేక కంగారులు మరోసారి టైటిల్ అందుకుంటారా? అనేది వేచి చూడాలి.
సౌతాఫ్రికా స్క్వాడ్
టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డిజోరి, ఎయిడెన్ మర్కరమ్, ముత్తుసామీ, మార్కో యాన్సన్, ముల్దర్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్‌హోమ్, ట్రిస్టన్ స్టబ్స్, కేవశ్ మహారాజ్, కగిసో రబడా, డేన్ పాటర్సన్, కగిసో రబడా, లుంగీ ఎంగిడి.
ఆస్ట్రేలియా స్క్వాడ్
స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, శామ్ కోన్‌స్టాస్, అలెక్స్ క్యారీ, ఇంగ్లిస్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్, హేజెల్‌వుడ్, మాట్ కున్నెమాన్, నాథన్ లయన్.
2025-06-10T09:14:32Z