ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023లో గుజరాత్ జెయింట్స్ పడిలేచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ వోల్వార్డెట్ (57: 45 బంతుల్లో 6x4, 1x6), గార్డ్‌నర్ (51 నాటౌట్: 33 బంతుల్లో 9x4) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఢిల్లీ బౌలర్లలో జాన్‌సెన్ రెండు, అరుంధతి రెడ్డి, మోరిజానె కాప్ చెరో వికెట్ తీశారు.
వాస్తవానికి గుజరాత్ జెయింట్స్ 147 పరుగుల స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఓపెనర్ డంక్లీ (4) ఫస్ట్‌లోనే ఔటైపోగా.. వోల్వార్డెట్, హర్లీన్ డియోల్ (31: 33 బంతుల్లో 4x4) చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. దాంతో 9.5 ఓవర్లు ముగిసే సమయానికి గుజరాత్ టీమ్ 53/2తో నిలిచింది. కానీ.. 10 ఓవర్ల తర్వాత గార్డెనర్ గేర్ మార్చి వరుస బౌండరీలు కొట్టేయగా.. వోల్వార్డెట్ కూడా బ్యాట్ ఝళిపించింది. మరోవైపు ఢిల్లీ బౌలర్లు లయ తప్పి వరుసగా ఫుల్‌టాస్ విసిరేశారు. దాంతో గుజరాత్ మెరుగైన స్కోరుని అందుకోగలిగింది.
డబ్ల్యూపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడి నాల్గింటిలో విజయం సాధించింది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ మాత్రం 5 మ్యాచ్‌లాడి నాల్గింటిలో ఓడిపోయింది. దాంతో పాయింట్ల పట్టికలోనూ గుజరాత్ చిట్టచివరి స్థానంలో ఉంది.
Read Latest
,
,
2023-03-16T16:14:21Z dg43tfdfdgfd