ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023 సీజన్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా టీమ్ బౌలర్లు మెరిశారు. దాంతో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ టీమ్ 135 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో గ్రేస్ హారిస్ (46: 32 బంతుల్లో 5x4, 2x6) టాప్ స్కోరర్‌గా నిలిచింది. బెంగళూరు బౌలర్లలో ఎల్సీ పెర్రీ మూడు, ఆశా శోభన, సోఫీ డివైన్ చెరో రెండు వికెట్లు తీశారు. అలానే మేఘన్ స్కౌట్, శ్రీకన్య పాటిల్ చెరో వికెట్ తీశారు. యూపీ టీమ్ 19.3 ఓవర్లలో ఆలౌటైంది.
డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బెంగళూరు టీమ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌కి రేసులో ఉండనుంది. దాంతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతూ బెంగళూరు బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టారు. హేలీ (1), దేవిక (0), మెక్‌గ్రాత్ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోయారు. దాంతో యూపీ టీమ్ 2 ఓవర్లు ముగిసే సమయానికి 5/3తో కష్టాల్లో పడింది.
కానీ.. ఈ దశలో కిరణ్ (22: 26 బంతుల్లో 2x4, 1x6), గ్రేస్ హారిస్ (46) సమయోచితంగా ఆడి తొలుత వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఆ తర్వాత పరుగులు రాబట్టారు. కానీ.. కిరణ్ ఔట్ తర్వాత మళ్లీ యూపీ బ్యాటర్లు తడబడ్డారు. సిమ్రాన్ (2), శ్వేత (6) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయారు. కానీ.. దీప్తి శర్మ (22: 19 బంతుల్లో 4x4) విలువైన పరుగులు చేయగా.. కర్నూలు అమ్మాయి అంజలి శర్వాణి (8: 9 బంతుల్లో 1x4) ఆఖర్లో కాసేపు క్రీజులో నిలిచింది. దాంతో యూపీ 135 పరుగుల స్కోరైనా చేయగలిగింది.
Read Latest
,
,
2023-03-15T16:28:49Z dg43tfdfdgfd