VIRAT KOHLI | విరాట్‌ విఫలం.. 6 రన్స్‌కే క్లీన్‌బౌల్డ్‌

న్యూఢిల్లీ: పుష్కరకాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli ) తీవ్ర నిరాశపరిచాడు. రంజీ మ్యాచ్‌లో రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాడు. యశ్‌ ధూల్‌ ఔట్‌ కావడంతో సెకండ్‌ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్‌కు వెనుతిరిగాడు. స్వంగ్వాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో విరాట్‌ బ్యాటింగ్‌ చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు.

అంతకుముందు విరాట్‌ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో స్టేడియం పూర్తిగా నిడింపోయింది. కోహ్లీ బ్యాంటింగ్‌కు వస్తుండగా అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అయితే తక్కువ రన్స్‌కే ఔటవడంతో నిరాశతో స్టేడియం నుంచి వెనుతిరిగారు. కాగా, ఢిల్లీ వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోవడంతో చిక్కులో పడింది. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసే సరికి 101 రన్స్‌ చేసింది. మరో 140 పరుగులు వెనకపడి ఉంది.

2025-01-31T05:55:30Z