India enters ICC U-19 Womens T20 World Cup 2023 Final. భారత జట్టు ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లింది.
భారత జట్టు ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాలోని సెన్వెస్ పార్క్ మైదానంలో శుక్రవారం (జనవరి 27) న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 14.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. స్వేతా సెహ్రావత్ (61 నాటౌట్), సౌమ్య తివారీ (22) రాణించారు. అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జనవరి 29న జరుగుతుంది.
2023-01-27T11:42:39Z dg43tfdfdgfd