TEAM OF THE TOURNAMENT: ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇదే.. రోహిత్ శర్మకే పగ్గాలు.. భారత ఆటగాళ్ల హవా

Team of the Tournament:  నెలన్నరగా క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన  ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ ముగిసింది.  ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా మధ్య ముగిసిన  ఫైనల్‌ పోరులో ఆసీస్‌ అద్భుత విజయంతో  ఆరోసారి  టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఇందులో భారత, ఆసీస్‌ క్రికెటర్ల హవా కొనసాగింది. 12 మందిని ప్రకటించగా ఇందులో ఏకంగా ఆరుగురు ప్లేయర్లు భారత్‌ నుంచే ఉండటం గమనార్హం. ఐసీసీ ఈ జట్టుకు రోహిత్‌  శర్మనే కెప్టెన్‌గా ప్రకటించింది.

ఇయాన్‌ బిషన్‌, కస్‌  నైడూ, షేన్‌ వాట్సన్‌, వసీం ఖాన్‌ (ఐసీసీ జనరల్‌ మేనేజర్‌, క్రికెట్‌), అహ్మదాబాద్‌కు చెందిన జర్నలిస్టు సునీల్‌ వైద్యలు  కలిసి ఈ జాబితాను రూపొందించారు.  టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌లో  రోహిత్‌తో పాటు కోహ్లీ, కెఎల్‌ రాహుల్‌,  రవీంద్ర జడేజా, బుమ్రా, మహ్మద్‌ షమీలకూ (మొత్తం ఆరుగురూ మనోళ్లే)  అవకాశం దక్కింది.  ఆసీస్‌ నుంచి  గ్లెన్‌  మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా చోటు దక్కించుకోగా  సౌతాఫ్రికా  ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, కివీస్‌ నుంచి  డారెల్‌ మిచెల్‌ ఉండగా లంక  యువ  పేసర్‌ దిల్షాన్‌ మధుశంక  కూడా  11 మందిలో చోటు దక్కించుకున్నాడు.  12వ ప్లేయర్‌గా సఫారీ పేసర్‌ గెరాల్డ్‌ కోయిట్జ్‌కు అవకాశం దక్కింది.

 

టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ ఇదే..

క్వింటన్‌ డికాక్‌ (594 పరుగులు)

రోహిత్‌ శర్మ (597)

విరాట్‌ కోహ్లీ (765)

డారెల్‌ మిచెల్‌ (552)

కెఎల్‌ రాహుల్‌ (452)

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (400)

రవీంద్ర జడేజా (120 రన్స్‌, 16 వికెట్లు)

జస్ప్రిత్ బుమ్రా (20 వికెట్లు)

దిల్షాన్‌ మధుశంక (21)

ఆడమ్‌ జంపా (23)

మహ్మద్‌ షమీ (24)

12వ ప్లేయర్‌: గెరాల్డ్‌ కొయెట్జ్‌ (20 వికెట్లు)

2023-11-20T11:32:43Z dg43tfdfdgfd