ఐపీఎల్ 2025 తర్వాత శ్రేయాస్ అయ్యర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లిన సర్పంచ్ సాబ్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం సలాం కొట్టింది. అటు కెప్టెన్సీ.. ఇటు బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించిన శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో 604 పరుగులు చేశాడు. అందులో ఆరు హాఫ్ సెంచరీలతో పాటు క్వాలిఫైయర్ 2లో ముంబైపై చేసిన 87 పరుగులే హైలెట్. ఒంటిచేత్తో పంజాబ్ విజయాల్లో కీలకంగా మారిన శ్రేయాస్ అయ్యర్ వైపు ఇప్పుడు బీసీసీఐ చూస్తోంది.
నేషనల్ మీడియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం మేరకు.. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి ఇచ్చిన లీడ్ ఆధారంగా.. ఆటగాడి నుంచి ఒక మంచి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎదిగిని తీరును బీసీసీఐ చూస్తోందంటా. ప్రస్తుతానికి కేవలం వన్డేలే ఆడుతున్న అయ్యర్‌ను.. అతి కొద్ది కాలంలోనే టీ20, టెస్టుల్లో కూడా తీసుకునే ఆలోచనలో బీసీసీఐ పడిందని బీసీసీఐ సోర్స్ వెల్లడించారు.
ప్రస్తుతానికి టీమిండియా మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. వన్డేలకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా, టీ20లకు స్కై సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. రోహిత్ రిటైర్మెంట్‌తో యువకుడైన శుభమన్ గిల్‌కు టెస్టు క్రికెట్ పగ్గాలను బీసీసీఐ అందజేసింది. మరి వైట్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్సీ రేసులో ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ కూడా చేరడం విశేషం.
వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం బీసీసీఐ ఇప్పటికే కీలక అడుగులు వేస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా యువకులతో కూడిన జట్టునే టీ20కు సిద్ధం చేస్తున్నాడు. బుమ్రా, సిరాజ్, షమీలను సైతం పక్కనబెట్టేసి యువ పేసర్లకు అవకాశం కల్పిస్తున్నారు. బ్యాటింగ్ విషయంలో అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మను ఇప్పటికే సన్నద్ధం చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను విజేతగా నిలిపిన శ్రేయాస్ అయ్యర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలిపాడు. ఐదేళ్ల వ్యవధిలో మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అయ్యర్ మూడింటినీ ఫైనల్స్‌కు తీసుకెళ్లి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను తొలిసారిగా ఫైనల్ బరిలో నిలబెట్టాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న అయ్యర్ త్వరలోనే వన్డే / టీ20 కెప్టెన్‌గా చూసే అవకాశం భారత క్రికెట్ జట్టు అభిమానులకు కలుగుతుంది.
2025-06-08T05:50:35Z