T20 WORLD CUP 2024 | స‌ఫారీ సైన్యంలో 18 ఏండ్ల స్పిన్న‌ర్.. కెప్టెన్‌గా లారా

T20 World Cup 2024 : మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం ద‌క్షిణాఫ్రికా స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం ఆ దేశ‌ సెలెక్ట‌ర్లు 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్(UAE) ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీలో స‌ఫారీ జ‌ట్టుకు లారా వొల్వార్డ్త్(Laura Wolvaardt) సార‌థ‌గా ఎంపికైంది. కెప్టెన్‌గా లారాకు ఇదే తొలి పొట్టి ప్రపంచ క‌ప్ కావ‌డం విశేషం.

ఆశ్చ‌ర్య‌క‌రంగా 18 ఏండ్ల లెగ్ స్పిన్న‌ర్ సెష్నీ నాయుడు (Seshnie Naidu)జాక్‌పాట్ కొట్టింది. జాతీయ జ‌ట్టు త‌ర‌ఫున ఆమె మొద‌టిసారి ప్ర‌పంచ క‌ప్ ఆడుతుండ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కూ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌ని స‌ఫారీ అమ్మాయిలు ఈసారి ట్రోఫీ క‌ల నిజం చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్టే.. సెలెక్ట‌ర్లు బ‌ల‌మైన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. ఈమ‌ధ్యే భార‌త ప‌ర్య‌ట‌న‌లో రాణించిన అన్నెకె బోస్చ్, డి క్లెర్క్, డెర్క్‌సెన్, సునె లుస్‌లను వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్‌కు సెలెక్ట్ చేశారు.

దక్షిణాఫ్రికా మ‌హిళ‌ల స్క్వాడ్ : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), అన్నెకె బోస్చ్, తంజిమ్ బ్రిట్స్, న‌డినె డి క్లెర్క్, అన్నెరీ డెర్క్‌సెన్, మీకె డి రిడ్డ‌ర్, అయంద హ్లుబీ, సినాలో జ‌ఫ్తా, మ‌రిజానే కాప్, అయ‌బొంగ ఖాక‌, సునె లుస్, నాన్‌కులులెకొ ల‌బా, సెష్నీ నాయుడు, తుమి సెఖుఖునె, క్లొయె టైర‌న్.

వ‌ర‌ల్డ్ క‌ప్ లీగ్ ద‌శ‌లో దక్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుకు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థులు ఎదురుకానున్నారు. అక్టోబ‌ర్ 4న‌ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను స‌ఫారీ టీమ్ ఢీకొన‌నుంది. అక్టోబ‌ర్ 7న ఇంగ్లండ్‌తో, అక్టోబ‌ర్ 9న స్కాట్లాండ్‌తో, అక్టోబ‌ర్ 12న బంగ్లాదేశ్‌తో ద‌క్షిణాఫ్రికా త‌ల‌ప‌డ‌నుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-09-03T13:49:17Z dg43tfdfdgfd