Srilanka : పొట్టి ప్రపంచ కప్ వైఫల్యం తర్వాత గాడిలో పడాలనుకున్న శ్రీలంక(Srilanka)కు భారత జట్టు భారీ షాకిస్తూ టీ20 సిరీస్ తన్నుకుపోయింది. సొంతగడ్డపై పొట్టి సిరీస్ పోవడంతో వన్డే సిరీస్ అయినా గెలవాలనే కసితో లంక ఉంది. అందుకని టీమిండియాతో వన్డే సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బలమైన స్క్వాడ్‌ను ప్రకటించింది. మూడో టీ20 సమయంలోనే లంక సెలెక్టర్లు 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. రెగ్యులర్ కెప్టెన్ కుశాల్ మెండిస్ (Kushal Mendis) స్థానంలో చరిత అసలంక(Charith Asalanka)కు పగ్గాలు అప్పగించారు.
ఈమధ్య టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన 24 ఏండ్ల నిషాన్ మధుష్క(Nishan Madhushka) బ్యాకప్ ఓపెనర్‌గా సెలెక్ట్ అయ్యాడు. సీనియర్ పేసర్ చమిక కరుణరత్నే, లంక ప్రీబమియర్ లీగ్‌లో మెరిసిన పేసర్ అసిత్ ఫెర్నాండోకు సైతం సెలెక్టర్లు అవకాశమిచ్చారు. భారత ,శ్రీలంకల మధ్య ఆగస్టు 2న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో వన్డే సిరీస్ మొదలవ్వనుంది.
నిషాన్ మధుష్క
శ్రీలంక స్క్వాడ్ : చరిత అసలంక(కెప్టెన్), పథుమ్ నిశాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిల్ లియనగే, నిశాన్ మధుష్క, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, థీక్షణ, అకిలా ధనంజయ, దిల్షాన్ మధుషనక, పథిరన, అసిత ఫెర్నాండో.