బర్మింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill).. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అతను 387 బంతుల్లో 269 రన్స్ చేశాడు. అయితే చిన్నప్పుడు ఎలా బ్యాటింగ్ చేశానో, ఆ తరహాలోనే ఆడేందుకు ప్రయత్నించినట్లు అతను చెప్పాడు. టెక్నిక్‌పై ఏమైనా ఫోకస్ పెట్టారా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఐపీఎల్ ముగిసిన తర్వాత.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, దీనిపై చాలా వర్క్ చేసినట్లు గిల్ తెలిపాడు. బాడీ మూమెంట్‌పై ప్రధానంగా వర్క్ చేశానని, బ్యాటింగ్ బాగానే సాగుతుందని అనుకున్నానని, టెస్టుల్లో 30, 40 రన్స్ ఈజీగా చేస్తున్నాని, కానీ కీలక సమయంలో ఏకాగ్రత మిస్ అవుతున్నాని అర్థమైందని, కొన్ని సార్లు ఎక్కువ ఫోకస్ చేస్తే కూడా నష్టం జరిగే అవకాశం ఉందని గ్రహించానని, అందుకే బేసిక్ ఆటకు ప్రాధాన్యం ఇచ్చానని, చిన్నప్పుడు ఆడిన స్టయిల్‌లో ఆడానని, లాంగ్ ఇన్నింగ్స్‌పై దృష్టి పెట్టకుండా, బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేసినట్లు చెప్పాడు.
గతంలో ఇంగ్లండ్ పిచ్‌లపై ఇండియన్ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అత్యధికంగా 221 రన్స్ చేశాడు. 1979లో అతను ఓవల్ మైదానంలో ఆ రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా ఇప్పుడు గిల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఈజీగా పరగులు రాబట్టలేని పక్షంలో.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడం ఇబ్బందిగా మారుతుందని, రన్స్ కోసం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి వస్తుందని, ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల బ్యాటింగ్ ఎంజాయ్ చేయలేకపోయానని గిల్ తెలిపాడు. మొదటి రోజు లంచ్ ముందు బ్యాటింగ్ చేయడానికి వెళ్లినప్పుడు, టీ విరామ సమయంలో తాను 40 రన్స్ వరకు స్కోర్ చేశానని, ఫ్రీగా రన్స్ స్కోర్ చేయలేకపోతున్న విషయాన్ని కోచ్ గంభీర్‌కు చెప్పానని తెలిపాడు. ఫస్ట్ టెస్టు మ్యాచ్‌లో ఈజీగా రన్స్ స్కోర్ చేశానని, కానీ ఈసారి బ్యాటింగ్ టఫ్‌గా ఉన్నా.. తన వికెట్‌ను వదలుకోవద్దు అన్న ఆలోచనలో ఉన్నానని, ఎందుకంటే టేయిలెండర్లు వరుసగా వికెట్లు చేజార్చుకునే అవకాశం ఉందని, ఆ ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో బర్మింగ్‌హామ్‌లో బ్యాటింగ్ చేసినట్లు గిల్ తెలిపాడు.
2025-07-04T07:40:53Z