న్యూఢిల్లీ: మేటి బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్(Saina Nehwal).. ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నది. అయితే ఈ ఏడాది చివరలోగా తన బ్యాడ్మింటన్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె చెప్పారు. 34 ఏళ్ల మాజీ వరల్డ్ చాంపియన్ సైనా.. గతంలో మూడు సార్లు ఒలింపిక్స్‌లో ఆడారు. లండన్ 2021 గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడల్ గెలచుకున్నది. తన కెరీర్ చివరి అంకంలో ఉందన్న విషయాన్ని తానేమీ పట్టించుకోవడం లేదన్నారు. మోకాలు సరిగా లేదని, ఆర్థరైటిస్ ఉందని, కార్టిలేజ్ కూడా చాలా బలహీనంగా మారిందని, 8 లేదా 9 గంటలు ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. షూటర్ గగన్ నారంగ్‌కు చెందిన హౌజ్ ఆఫ్ గ్లోరి పాడ్‌కాస్ట్‌లో సైనా నెహ్వాల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆర్థరైటిస్‌తో బాధపతున్న మీరు.. ఎలా మేటి ప్లేయర్లను ఢీకొంటారని నారంగ్ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు బదులిస్తూ ఆ వాస్తవాన్ని ఏదో ఒక సమయంలో అంగీకరించాలని, టాప్ ప్లేయర్లతో ఆడాలంటే రెండు గంటల శిక్షణ సరిపోదని ఆమె పేర్కొన్నారు. రిటైర్మెంట్ వల్ల తనపై ప్రభావం పడే అవకాశం ఉన్నా.. కానీ దానిపై నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. సైనా చివరిసారి గత ఏడాది సింగపూర్ ఓపెన్‌లో ఆడింది. కానీ ఆ టోర్నీలో ఆమె ఫస్ట్ రౌండ్‌లోనే నిష్క్రమించింది. 9 ఏళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించానని, వచ్చే ఏడాది 35 నిండనున్నట్లు ఆమె చెప్పింది. చాలా లాంగ్ కెరీర్ ఆటలో ఉన్నట్లు ఆమె అంగీకరించారు. ఒలింపిక్స్‌లో పోటీపడాలన్నది తన చిన్ననాటి కల అని, కానీ గత రెండు ఈవెంట్లకు దూరం కావడం బాధగా ఉన్నట్లు ఆమె చెప్పారు.
2024-09-02T09:18:44Z dg43tfdfdgfd