పారిస్: పారా ఒలింపిక్స్‌లో ఇండియాకు మరో మెడల్ దక్కింది. ప్రపంచ చాంపియన్ సచిన్ సర్జేరావ్ ఖిలారి(Sachin Sarjerao Khilari).. పురుషుల షాట్ పుట్ ఎఫ్46 కేటగిరీలో సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అతను 16.32 మీటర్ల దూరం విసిరాడు. దీంతో పారిస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ రంగంలో ఇండియాకు 11వ మెడల్ కాగా, ఓవరాల్‌గా ఇండియా పారాలింపిక్స్‌లో ఇప్పటి వరకు 21 మెడల్స్ గెలుచుకున్నది. సచిన్ తన ప్రయత్నాల్లో షాట్‌పుట్‌ను 14.72, 16.32, 16.15, 16.31, 16.03 దూరం త్రో చేశాడు. ఇండియా నుంచి ఇదే ఈవెంట్‌లో పోటీపడిన యాసిర్, రోహిత్‌లు ఔటయ్యారు. స్వర్ణ పతకం సాధించిన వ్యక్తి కన్నా కేవలం 0.06 మీటర్ల తక్కువ దూరం విసిరాడు సచిన్. 30 ఏళ్ల పారాలింపిక్స్‌లో ఇండియాకు షాట్ పుట్‌లో పతకం రావడం ఇదే మొదటిసారి.