ROHIT SHARMA: టెస్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మ ఔట్‌? తదుపరి కెప్టెన్‌ ఎవరు?

Rohit Sharma No More As Test Captain: భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మకు బీసీసీఐ భారీ షాక్‌ ఇచ్చింది. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి రోహిత్‌ శర్మను తప్పించింది. రానున్న ఇంగ్లాండ్‌ సిరీస్‌తోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నేపథ్యంలో రోహిత్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. టెస్టు క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్‌ శర్మను తప్పించడం చర్చనీయాంశం కాగా.. తదుపరి భారత టెస్టు క్రికెట్‌ కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తదుపరి టెస్టు కెప్టెన్‌ ఎవరు? అనే చర్చ జోరుగా సాగుతోంది.

Also Read: MS Dhoni Retires: సీఎస్కే ఫ్యాన్స్‌కు షాక్‌.. కొన్నిరోజుల్లోనే ధోనీ రిటైర్మెంట్‌?

భారత క్రికెట్‌లో రోహిత్‌ శర్మకు ఓ చరిత్ర ఉంది. హిట్‌మ్యాన్‌గా పేరొందిన రోహిత్‌ శర్మ అన్ని ఫార్మాట్‌లలో రికార్డులు నెలకొల్పి అద్భుతమైన విజయాలు సాధించాడు. కెప్టెన్‌గా ఒడిదుడుకులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ ఇప్పుడు ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. క్రికెటర్‌గానే కాకుండా కెప్టెన్‌గాను విఫలమవుతుండడంతో రోహిత్‌ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీనికితోడు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున కూడా రోహిత్‌ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ను బీసీసీఐ వర్గాలు కెప్టెన్‌గా తప్పించినట్లు తెలుస్తోంది.

Also Read: IPL 2025: ఆ అన్నారు. ఆహా అన్నారు.. ఓహో అన్నారు.. లాస్ట్ కి తుస్సుమన్నారు..SRH కథ కంచికి

ఐపీఎల్‌ ముగియగానే భారత జట్టు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడనుంది. అనంతరం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఉంది. ప్రతిష్టాత్మక మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో భారత జట్టు తప్పక విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాడికి సారథ్య బాధ్యతలు అప్పగించే యోచనలో బీసీసీఐ ఉంది. అజిత్‌ అగర్కార్‌ నేతృత్వంలోనే భారత సెలక్షన్‌ కమిటీ రోహిత్‌ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కక పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కెప్టెన్‌గా విఫలమవుతుండడంతో రోహిత్‌ను తప్పించి అతడి స్థానంలో వేరే కుర్ర ఆటగాడికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. తదుపరి టెస్టు కెప్టెన్‌ ఎవరనే అంశంపై కూడా జోరుగా చర్చలు నడుస్తున్నాయి. సీనియర్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ లేదా బుమ్రాకు ఇస్తారని ప్రచారం జరుగుతుండగా.. యువ క్రికెటర్‌లను పరిశీలిస్తే శుభమన్‌ గిల్‌ టెస్టు కెప్టెన్‌గా ముందు వరుసలో ఉన్నాడు. మరి బీసీసీఐ మదిలో ఏముందో అనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

2025-05-07T13:56:30Z