Rishabh Pant : అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాటుతో కాకుండా తమ చేష్టలతోనూ అభిమానులను అలరించే ఆటగాళ్లలో రిషభ్ పంత్ (Rishabh Pant) ముందువరుసలో ఉంటాడు. ఒంటిచేత్తో సిక్సర్లు బాదుతూ.. ఒంటికాలిపైనే బంతిని బౌండరీకి తరలిస్తూ మైదానంలో విన్యాసాలు చేస్తుంటాడు. ఫైన్ లెగ్‌లో ఆడబోయి.. క్రీజులో పడిపోతుంటాడు. తాజాగా ఇంగ్లండ్ సిరీస్‌లోనూ పంత్ తనదైన బ్యాటింగ్ విన్యసాలతో ప్రేక్షకులను రంజింపజేశాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ చిచ్చరపిడగు బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు.
జోష్ టంగ్ ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయిన పంత్ బంతిని బలంగా కొట్టాలనుకున్నాడు. కానీ, స్వింగ్ కారణంగా బంతి మిస్ అయి వికెట్ కీపర్ స్మిత్ చేతుల్లో పడింది. అతడి బ్యాటేమో పక్షిలా గాల్లో తేలుతూ కొద్ది దూరంలో పడింది. ఆ ఫన్నీ వీడియోను పెద్ద స్క్రీన్‌పై ప్లే చేయగా.. ప్రేక్షకులు వాట్ ఏ ప్లేయర్ అంటూ నవ్వుకున్నారు.
లంచ్ తర్వాత మళ్లీ పంత్ బ్యాట్ అతడి చేతుల్లోంచి జారిపోయింది. అయితే.. ఈసారి అతడు పెవిలియన్‌కు వెళ్లాల్సి వచ్చింది. భోజన విరామం అనంతరం అర్ధ శతకం సాధించిన పంత్ మరింత దూకుడుగా ఆడాడు. టంగ్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదిన అతడు.. బషీర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన అతడు.. తర్వాత బంతికి లాంగాఫ్ దిశగా సిక్సర్‌కు యత్నించాడు.
కానీ, సీన్ రివర్స్ అయింది. మరోసారి బ్యాట్ అతడి చేతుల్లోంచి జారిపోయింది. ఈసారి మాత్రం అక్కడే కొచుకొని ఉన్న బెన్ డకెట్ క్యాచ్ అందుకున్నాడు. అంతే.. పంత్ విధ్వంసక ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికే కెప్టెన్ గిల్‌తో నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడీ డాషింగ్ బ్యాటర్. వీళ్లిద్దరి జోరుతో టీమిండియా ఆధిక్యం 400 ప్లస్‌కు చేరింది.