న్యూఢిల్లీ: ఒకవేళ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై బయోపిక్ తీస్తే, ఆ ఫిల్మ్‌లో నటిస్తానని టాలీవుడ్ హీరో రాంచరణ్(Ramcharan) అన్నాడు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో అతను పాల్గొన్నాడు. అయితే ఆ సమయంలో హోస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు రాంచరణ్ బదులిచ్చాడు. ఎటువంటి మూవీలో నటించడానికి ఇష్టపడుతారని రామ్‌ను అడిగారు. కొంతసేపు ఆలోచించిన చెర్రీ.. ఏదైనా స్పోర్ట్స్ అంశం(sports story)తో ఉన్న ఫిల్మ్‌లో నటించాలనుకుంటున్నట్లు చెప్పాడు. స్పోర్ట్స్ సబ్జెక్ట్ ఉన్న ఫిల్మ్‌లో నటిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ బయోపిక్(Kohli Biopic)లో నటిస్తారా అని అడగ్గా.. నటిస్తానని రాంచరణ్ అన్నాడు. కోహ్లీ అద్భుతమైన వ్యక్తి అని, చాలా ప్రేరణాత్మక క్రికెటర్ అని, ఒకవేళ ఛాన్స్ ఇస్తే, కచ్చితంగా ఆ ఫిల్మ్‌లో నటిస్తానని చెర్రీ చెప్పాడు. తన ఫేస్ కట్ కూడా కోహ్లీ తరహాలోనే ఉంటుందన్న ఓ సిగ్నల్ కూడా రాంచరణ్ ఇచ్చాడు.
రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలోని నాటు నాటు సాంగ్(Naatu Naatu song)కు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఆ అవార్డును లాస్ ఏంజిల్స్‌లో జరిగిన వేడుకలో అందుకున్న చెర్రీ.. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే కాన్‌క్లేవ్(India today conclave)కు హాజరయ్యాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రాంచరణ్‌కు ఘన స్వాగతం లభించింది. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే సమయంలో.. కోహ్లీ ఫీల్డింగ్ చేస్తూ.. నాటు నాటు పాటపై స్టెప్పులేశాడు. కోహ్లీ డ్యాన్స్ మూవ్స్‌ను టీవీ కెమెరాలు బంధించాయి. ఆ స్టెప్స్ కు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ప్రస్తుతం రాంచరణ్ ఆర్‌సీ15(RC15) అనే ఓ పొలిటికల్ థ్రిల్లర్ నటిస్తున్నాడు. ఆ ఫిల్మ్‌లో కియారా అద్వానీ నటిస్తోంది. ఫేమస్ డైరెక్టర్ శంకర్(Director Shankar) ఆ చిత్రాన్ని తీస్తున్నారు.
2023-03-18T04:21:23Z dg43tfdfdgfd