Rahul Dravid | భారత క్రికెట్ అభిమానులు ‘ది వాల్’ అని పిలుచుకునే మిస్టర్ డిపెండెబుల్ రాహుల్ ద్రావిడ్ మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన ద్రావిడ్.. టీమిండియా కోచ్‌గా వైదొలిగాక మళ్లీ హెడ్‌కోచ్ బాధ్యతలను చేపట్టనున్నాడట. గతంలో తాను సారథిగా వ్యవహరించి, మెంటార్‌గా కూడా పనిచేసిన రాజస్థాన్ రాయల్స్‌కు వచ్చే సీజన్ నుంచి హెడ్‌కోచ్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అతడు ఒప్పంద ప్రక్రియనూ పూర్తిచేసినట్టు సమాచారం.
ఈఎస్పీఎన్‌లో వచ్చిన కథనం మేరకు.. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి ద్రావిడ్, రాజస్థాన్ రాయల్స్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేయనున్నాడట. అంతకంటే ముందే జరుగబోయే ఐపీఎల్ రిటెన్షన్స్‌లో కూడా అతడు పాలుపంచుకునే అవకాశముంది. రాజస్థాన్‌తో ద్రావిడ్ అనుబంధం ఈనాటిది కాదు. 2012 నుంచే అతడు రాజస్థాన్ జట్టుతో సంబంధాలు నెరుపుతున్నాడు. 2012, 2013 సీజన్‌లలో రాజస్థాన్ ఫ్రాంచైజీకి సారథిగా వ్యవహరించిన ద్రావిడ్.. 2014, 2015 సీజన్‌లలో అదే జట్టుకు మెంటార్‌గానూ పనిచేశాడు. ద్రావిడ్‌తో పాటు జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన విక్రమ్ రాథోడ్.. రాజస్థాన్ రాయల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఉండనున్నట్టు తెలుస్తోంది. శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర ఆ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ ది క్రికెట్‌గా ఉండనున్నాడు. రాజస్థాన్‌కు ఐపీఎల్‌లోనే గాక కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), సౌతాఫ్రికా టీ20 (ఎస్‌ఎ20)లలోనూ ఫ్రాంచైజీలున్నాయి.
ద్రావిడ్ విషయానికొస్తే.. 2015లో రాజస్థాన్‌ను వీడి బీసీసీఐతో చేరిన ద్రావిడ్.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా, అండర్-19 క్రికెట్ జట్టుకు హెడ్‌కోచ్‌గా పలు బాధ్యతల్లో విధులు నిర్వర్తించాడు. 2021లో భారత జట్టుకు కోచ్‌గా వచ్చి 2023 వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలోనూ కీలకపాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది వెస్టిండీస్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించడంలోనూ ద్రావిడ్ పాత్ర కొట్టిపారేయలేనిది. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008)లో టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ విజేతగా నిలవని రాజస్థాన్.. పలుమార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌గానే మిగిలింది. మరి ద్రావిడ్ రీఎంట్రీతో రాజస్థాన్ రాత మారుతుందో లేదో చూడాలి..!
2024-09-04T12:19:42Z dg43tfdfdgfd