Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో మంగళవారం రెండు పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను భాకర్(Manu Bhaker), సరబోజ్యోత్ సింగ్(Sarabjot Singh) జంట కాంస్య పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది . విశ్వ క్రీడల్లో ఒకే ఈవెంట్‌లో రెండు పతకాలు గెలిచిని తొలి భారత షూటర్‌గా మను చరిత్ర సృష్టించింది.
మరోవైపు రోవింగ్‌లో బాల్‌రాజ్ పన్వర్ (Balraj Panwar) మాత్రం నిరాశ పరిచాడు. హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోటీల్లో బాల్‌రాజ్ ఐదో స్థానంలో నిలిచాడు. పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రౌండ్ నుంచి అద్భుతంగా రాణించిన బాల్‌రాజ్ భారీ అంచనాలతో క్వార్టర్స్‌లో పోటీ పడ్డాడు.
అయితే.. శక్తినంత కూడదీసికొని మరీ ప్రయత్నించినా సరే బెర్తు సాధించలేకపోయాడు. 7:05.10 నిమిషాల్లో రేసు పూర్తి చేసి క్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. దాంతో, ఒలింపిక్స్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి రోవర్‌గా రికార్డును మిస్ అయ్యాడు. క్వార్టర్స్‌లో ప్రతి గ్రూప్ నుంచి టాప్ 3లో నిలిచినవాళ్లు సెమీస్‌కు అర్హత సాధించారు.