Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మనుభాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో విడిగా ఒకటి, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి జోడీగా మరొకటి రెండు కాంస్య పతకాలు నెగ్గింది. ఇప్పుడు బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
క్వార్టర్స్‌లో ఇండోనేషియా జోడీ ఫజర్ అల్ఫియాన్-రియాన్ ఆర్డియాంటోను 21-13, 21-13 తేడాతో ఓడించింది. వరుసగా రెండు సెట్లను నెగ్గి ఇండోనేషియా జోడీని చిత్తు చేసింది. ఇక మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ భజన్ కౌర్ 1/16 ఎలిమినేషన్ రౌండ్‌కు చేరుకుంది. 1/32 రౌండ్‌లో సిఫా నూరాఫిఫా కమల్‌ను 7-3 తేడాతో మట్టి కరిపించింది. 1/16 రౌండ్‌లో నెగ్గితే భజన్ కౌర్ క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టనుంది.