Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ (Akula Sreeja) అదరగొడుతోంది. తన సంచలన ఆటతో ఆమె ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. తద్వారా వ్యక్తిగత విభాగంలో ప్రీ క్వార్టర్స్ చేరిన భారత తొలి టీటీ ప్లేయర్‌గా శ్రీజ చరిత్ర సృష్టించింది.
బుధవారం సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్(Jian Zeng)ను శ్రీజ 4-2తో ఓడించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత పెడ్లర్ అద్భుతంగా ఆడింది. తొలి సెట్‌లో వెనకడినా ఆ తర్వాత పుంజుకొని జియాన్‌కు చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో శ్రీజ 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10తో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
2024-07-31T12:02:50Z dg43tfdfdgfd