P.V Sindhu Defeat: పారిస్ ఒలింపిక్స్‌లో 5వ రోజు భారత్ ఏ పతకాన్ని సాధించలేదు. కానీ ఆరో రోజు స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. బ్యాడ్మింటన్‌లో 16వ రౌండ్‌లో లక్ష్యసేన్ హెచ్‌ఎస్ ప్రణయ్‌పై విజయం సాధించాడు. తాజాగా ప్రిక్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి హె బింగ్ జియావో చేతిలో పీవీ సింధు ఓటమి పాలయ్యింది. 19-21, 14-21 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో హె బిన్ జియావో మొదటి గేమ్‌లో ముందంజలో ఉంది. తర్వాత పీవీ సింధు ఆధిక్యాన్ని సమం చేసింది. చివరిలో ఇద్దరికి సమాన పాయింట్లు వచ్చాయి. కానీ చివరికి చైనా క్రీడాకారిణి 21-19తో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అటు నిఖత్ జరీన్ కూడా బాక్సింగ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వీరిపై భారత్ పతక ఆశలు పెట్టుకుంది.