Paralympics 2024 : పారిలింపిక్స్‌లో భారత షట్లర్ నితీశ్ కుమార్ (Nitesh Kumar) పసిడి పతకం కొల్లగొట్టాడు. సోమవారం జరిగిన ఫైనల్లో నితీశ్ జయకేతనం ఎగురువేశాడు. దాంతో, పారిలింపిక్స్‌లో రెండో స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ పసిడి పోరులో నితీశ్ అదరగొట్టాడు. బ్రిటన్‌కు చెందిన డానియల్ బెథెల్(Daniel Bethell)ను మూడు సెట్లలో ఓడించి గోల్డ్ మెడల్ సాధించాడు. దాంతో, భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరగా.. మొత్తంగా పతకాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
పారిస్‌లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్న నితీశ్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్లో డానియల్ బెథెల్‌ను మట్టికరిపించాడు. తొలి సెట్‌ను 21-14తో అలవోకగా గెలుపొందిన నితీశ్ రెండో సెట్ కోల్పోయాడు. అయితే.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో పంజా విసిరిన భారత షట్లర్ ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. డానియల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. అయితే.. చివరకు 23-21తో నితీశ్ గెలుపొందాడు.