Paralympics 2024 : పారిలింపిక్స్‌లో భారత షట్లర్ సంచలనం సృష్టించింది. బ్యాడ్మింటన్‌లో ఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా తులసీమథి మురుగేశన్ (Thulasimathi Murugesan) రికార్డు నెలకొల్పింది. తద్వారా ఈ పారా బ్యాడ్మింటన్ స్టార్ స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన ఎస్‌యూ5 సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మనీషా రామదాస్(Manisha Ramadasu)ను మురుగేశన్ ఓడించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన పోరులో మురుగేశన్ అద్భుత విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. పసిడి పతకం కోసం ఆమె చైనాకు చెందిన యాంగ్ గ్జిక్జియాతో తలపడనుంది.
పారిస్ ఆతిథ్యమిస్తున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు తులసీమథి మురుగేషన్ మరో పతకం ఖాయం చేసింది. ఇండియాకే చెందిన మనీషా రామదాసుతో హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో 23-21, 21-17తో విజయం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి భారత పారా షట్లర్‌గా రికార్డు సొంతం చేసుకుంది.
ఇప్పటివరకూ ఈ పోటీల్లో భారత్కు ఏడు పతకాలు వచ్చాయి. షూటింగ్‌లో అవని లేఖరా గోల్డ్ మెడల్‌తో బోణీ కొట్టగా.. మోనా అగర్వాల్, మనీశ్ నర్వాల్‌లు కాంస్యంతో మెరిశారు. అనంతరం 100 మీటర్ల రేసులో ప్రీతి పాల్ కంచు మోత మోగించింది. అంతేకాదు 200 మీటర్ల పోటీలోనూ ప్రీతి కాంస్యం కొల్లగొట్టింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ రజతంతో మెరిసింది.