Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత మహిళా షట్లర్లు చరిత్ర సృష్టించారు. మథీ మురుగేశన్ (Thulasimathi Murugesan) రజతం కొల్లగొట్టగా.. మనీషా రామదాసు(Manisha Ramadasu) కాంస్యంతో గర్జించింది. దాంతో, విశ్వక్రీడల బ్యాడ్మింటన్‌లో పతకం గెలుపొందిన తొలి పారా మహిళా క్రీడాకారులుగా ఈ ఇద్దరూ రికార్డు నెలకొల్పారు.
సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ ఫైనల్లో తులసీమథీ స్వర్ణం చేజార్చుకుంది. చైనాకు చెందిన యాంగ్ గ్జిక్జియా చేతిలో ఓడి వెండితో సరిపెట్టుకుంది. ఇక సెమీస్‌లో తులసీమథి ధాటికి చేతులెత్తేసిన మనీష రామదాసు(Manisha Ramadasu) కాంస్యం సొంతం చేసుకుంది. దాంతో, కాంస్య పోరులో మనీష వెనక్కి తగ్గలేదు. డెన్మార్క్ షట్లర్ క్యాథరిన్ రొసెన్‌గ్రెన్()ను చిత్తుగా ఓడించి పతకంతో మురిసింది. తులసీ, మనీశ మెరవడంతో భారత్ పతకాల సంఖ్య పదికి చేరింది.
పారిస్‌లో సోమవారం భారత అథ్లెట్లు పతకాల వేటలో విజయవంతమయ్యారు. డిస్కస్ త్రోలో యోగేశ్ కథునియా (Yogesh Kathuniya) రజతం కొల్లగొట్టాడు. డిస్కస్ త్రో ఎఫ్56 ఫైనల్లో యోగేశ్ పతకంతో గర్జించాడు. తన బలాన్నంత కూడదీసుకొని డిస్కస్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. రెండో స్థానంలో నిలిచిన యోగేశ్ విశ్వ క్రీడల్లో దేశానికి మూడో రజతం అందించాడు.
ఇప్పటివరకూ ఈ పోటీల్లో భారత్‌కు ఏడు పతకాలు వచ్చాయి. షూటింగ్‌లో అవని లేఖరా(Avani Lekhara) గోల్డ్ మెడల్‌తో బోణీ కొట్టగా.. మోనా అగర్వాల్, మనీశ్ నర్వాల్‌లు కాంస్యంతో మెరిశారు. అనంతరం 100 మీటర్ల రేసులో ప్రీతి పాల్ కంచు మోత మోగించింది. అంతేకాదు 200 మీటర్ల పోటీలోనూ ప్రీతి కాంస్యం కొల్లగొట్టింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 విభాగంలో రుబీనా ఫ్రాన్సిస్ రజతంతో మెరిసింది.