Paralympics 2024 : పారాలింపిక్స్‌లో దివ్యాంగులైన మహిళలు, పురుషులు పోటీ పడడం చూశాం. కంటిచూపులేనివాళ్లు, మూగవాళ్లు, వినికిడి సమస్యలు ఉన్నవాళ్లు పతకాల వేటలో పంజా విసిరారని చదివాం. అయితే.. పారిస్‌లో అందుకు భిన్నంగా ఓ ట్రాన్స్‌జెండర్(Transgender) బరిలో నిలిచింది. ట్రాక్ మీద చిరుతలా పరుగులు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అది కూడా 50 ఏండ్ల వయసులో. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో పాల్గొన్న తొలి మహిళా ట్రాన్స్‌జెండర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
ఇంతకు ఆమె ఎవరు? ఏ దేశం తరఫున పోటీ పడింది? అనే విషయాలకొస్తే.. ఇటలీకి చెందిన వాలెంటీనా పెట్రిల్లో(Valentina Petrillo) ఓ ట్రాన్స్‌జండర్. ఆమెకు కండ్లు కనపడవు. కారణం ఏంటంటే..? వాలెంటీనాకు ‘స్టార్‌గర్డ్ట్’ (Stargardt)అనే జన్యుపరమైన సమస్య ఉంది.
దాంతో, ఆమె రెటీనా సరిగ్గా పనిచేయదు. చూపు సరిగ్గాలేకున్నా సరే ఆమె పరుగు పందెంలో రాణించింది. అలా ఈ ఏడాది పారాలింపిక్స్‌కు వాలెంటీనా అర్హత సాధించింది. సోమవారం జరిగిన టీ12 400 మీటర్ల క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఆమె మెరుపు వేగంతో దౌడు తీసింది. 53.35 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని సెమీఫైనల్‌కు క్వాలిఫై అయింది.