PARALYMPICS 2024 | క్వార్ట‌ర్ ఫైన‌ల్లో పూజ ఓట‌మి.. ప‌త‌క ఆశ‌లు గల్లంతు

Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భార‌త పారా ఆర్చ‌ర్ పూజ(Pooja) పోరాటం ముగిసింది. మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ విభాగంలో ఆమె ప‌త‌క ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ఆమె చైనాకు చెదిన వూ చుయాన్(Wu Chuyan) చేతిలో ఓటమి పాలైంది. తొలి రెండు రౌండ్ల‌లో వెన‌క‌బ‌డిన చైనా ఆర్చ‌ర్ అనూహ్యంగా పుంజుకొని పూజకు షాకిచ్చింది.ఉత్కంఠ పోరులో 6-4తో గెలుపొంది సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది.

పారిస్‌లో ప‌త‌కమే లక్ష్యంగా క్వార్ట‌ర్స్ వ‌ర‌కూ వ‌చ్చిన పూజ ముందంజ వేయ‌లేక‌పోయింది. తొలి సెట్‌లో చెక్కు చెద‌ర‌ని గురితో బాణాలు సంధించిన పూజ 28-23తో గెలుపొందింది. అనంత‌రం రెండో సెట్‌లోనూ 24-20తో నాలుగు పాయింట్ల ఆధిక్యం సంపాదించింది. ఆ త‌ర్వాత కూడా ఆమె అంతే ఏకాగ్ర‌త‌తో గురి పెట్దలేక‌పోయింది. మ‌రోవైపు.. చైనా ఆర్చ‌ర్ వూ చుయాన్ అసాధార‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివ‌ర‌కు 6-4తో విజ‌యం సాధించింది.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-09-03T16:19:17Z dg43tfdfdgfd