Newzealand Cricket: న్యూజిలాండ్ క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్లకు షాకిచ్చిన సెలెక్టర్లు ఇద్దరు కొత్త కుర్రాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contract) కట్టబెట్టారు. యువ ఆల్‌రౌండర్లు నాథన్ స్మిత్(Nathan Smith), జోష్ క్లార్క్‌సన్ (Josh Clarkson)లు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్టు ఇచ్చారు. డేంజరస్ ఓపెనర్ డెవాన్ కాన్వే, విధ్వంసక ఆటగాడు ఫిన్ అలెన్ స్థానంలో స్మిత్, జోష్‌లను ఎంపిక చేసినట్టు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.
దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన స్మిత్ 33 వికెట్లతో అదరహో అనిపించాడు. అంతేకాదు 6/36తో కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. వైట్‌బాల్ టోర్నీల్లోనే మెరిసిన స్మిత్.. ఈ ఏడాది మార్చిలో అతడు న్యూజిలాడ్ క్రికెట్ అవార్డు వేడుకలో ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు.
ఇక జోష్ క్లార్క్‌సన్ విషయానికొస్తే.. 2022-23 దేశవాళీ సీజన్‌లో దుమ్మురేపాడు. దాంతో, సెలెక్టర్లు అతడికి చాన్స్ ఇవ్వడంతో నిరుడు డిసెంబర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ జోష్ కివీస్ తరఫున మూడు వన్డేలు, ఆరు టీ20లు ఆడాడు. న్యూజిలాండ్ భావి తారలుగా ప్రశంసలందుకున్న ఈ ఇద్దరికీ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కడంతో మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ : టామ్ బ్లండెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫ్ఫీ, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోలస్, విల్ ఓ రూర్కే, అజజ్ పటేల్, గ్లెన్ ఫిలిఫ్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ, విల్ యంగ్.