MS DHONI అవార్డుల లిస్ట్ తెలుసా? వన్ అండ్ ఓన్లీ మిస్టర్ కూల్!

టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తించి ఐసీసీ ఈ అవార్డు ప్రకటించింది. ఐసీసీ అవార్డులతో పాటు భారత ప్రభుత్వం కూడా మిస్టర్ కూల్‌కి ఎన్నో అవార్డులను ప్రకటించింది. 2005లో టీమిండియాలోకి అడుగుపెట్టిన ధోనీ 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌కు అత్యున్నత పురస్కారాలను ధోనీ అందుకున్నాడు.

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 2007లో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ అందుకున్న ధోనీ, 2011లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించాడు. అదేవిధంగా భారత్‌ను టెస్టుల్లో నెంబర్ 1 స్థానంలో నిలిపి రికార్డు సృష్టించాడు.

ధోనీ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2008లో ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేసింది. 2009లో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీకి అవార్డును అందుకున్నాడు. 2011లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఇండియన్ ఆర్మీలో బాధ్యతలు కూడా చేపట్టాడు. 2018లో పద్మ భూషణ్ అవార్డును అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో కూడా స్థానం సంపాదించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి ధోనీ 538 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 17,266 పరుగులు సాధించాడు. అత్యధికంగా 350 వన్డేల్లో 10773 పరుగులు చేశాడు. పది సెంచరీలతో పాటు 73 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో ఒక డబుల్ సెంచరీ, ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలతో 4876 పరుగులు చేశాడు. టీ20ల్లో 98 మ్యాచ్‌లు ఆడిన ధోనీ రెండు హాఫ్ సెంచరీలతో 1617 పరుగులు నమోదు చేశాడు.

2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమ తర్వాత ధోనీ మరో మ్యాచ్ ఆడలేదు. 2020 డిసెంబర్‌లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్న ధోనీ ఫ్యాన్స్ ఒత్తిడితో ఐపీఎల్ 2026లోనూ కనిపించనున్నాడు.

2025-06-10T07:13:55Z