IPL 2O23 | మూడో సెంచ‌రీతో క‌దం తొక్కిన‌ శుభ్‌మ‌న్ గిల్.. ప్లే ఆఫ్స్‌లో రికార్డు స్కోర్ కొట్టిన గుజ‌రాత్

IPL 2O23 : ఐపీఎల్ 16వ సీజ‌న్ క్వాలిఫైయ‌ర్ 2 పోరులో గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(129 : 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లు) సెంచ‌రీ బాదాడు.కెరీర్‌లోనే భీక‌ర ఫామ్‌లో ఉన్న అత‌ను ఐపీఎల్‌లో మూడో సెంచ‌రీ కొట్టాడు. 30 ర‌న్స్ వ‌ద్ద ఔట‌య్యే ప్ర‌మాదం త‌ప్పించుకున్న అత‌ను.. ఆ త‌ర్వాత ముంబై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఫోర్లు, సిక్స్‌ల‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. సాయి సుద‌ర్శ‌న్(43 రిటైర్డ్ ఔట్) రాణించ‌డంతో గుజ‌రాత్ రెండు వికెట్ల న‌ష్టానికి 233 ప‌రుగులు చేసింది. దాంతో,  అత్య‌ధిక‌  జ‌ట్టుగా గుజరాత్ జ‌ట్టు రికార్డు సృష్టించింది.

వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. టాస్ ఓడిన గుజ‌రాత్‌కు ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్(129) భారీ స్కోర్ అందించాడు. అచ్చొచ్చిన స్టేడియంలో ఈ యంగ్‌స్ట‌ర్ రెచ్చిపోయి ఆడాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన అత‌ను శ‌త‌కంతో ముంబై బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. తొలి వికెట్‌కు 50 ప్ల‌స్ జోడించాక‌ వృద్ధిమాన్ సాహా(18) ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత సాయి సుద‌ర్శ‌న్(43 రిటైర్డ్ ఔట్)తో జ‌త‌క‌లిసిన గిల్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

బౌల‌ర్ ఎవ‌రైనా స‌రే బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. అత‌ని ధాటికి ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో 5 రన్స్‌కే 5 వికెట్లు తీసిన ఆకాశ్ మ‌ధ్వాల్ ధారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. క్రిస్ జోర్డాన్ వేసిన 20వ ఓవ‌ర్లో రెండో బంతికి ర‌షీద్ ఖాన్(5 నాటౌట్) ఫోర్ బాదాడు. హార్ధిక్ పాండ్యా(28 నాటౌట్) ఐదో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఆఖ‌రి బాల్‌ను సిక్స‌ర్‌గా మ‌లిచాడు. దాంతో గుజ‌రాత్ కీల‌క పోరులో 233 ప‌రుగులు చేసింది.

2023-05-26T16:37:47Z dg43tfdfdgfd