INDIAN PLAYERS | ఆపరేషన్‌ సిందూర్‌పై భారత్ ఆటగాళ్లు కామెంట్స్

భారత భద్రతా దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎల్లవేళలా దేశం గర్వపడే విధంగా మన సైనికులు విరోచితంగా పోరాడుతూనే ఉన్నారు. భద్రతా బలగాల నైతిక ైస్థెర్యాన్ని దెబ్బతీయకుండా నకిలీ వార్తలు వ్యాప్తి చేయకుండా దేశ పౌరులుగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంది.

– రోహిత్‌శర్మ

దేశం కోసం పోరాడుతున్న భద్రతా బలగాలకు మనం అండగా నిలువాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో వారు దేశాన్ని కాపాడుతున్నారు. ముష్కర మూకలతో తలపడుతూ దేశాన్ని సమున్నత స్థితిలో నిలిపేందుకు ప్రాణాలు వదులుతున్న సైనిక హీరోలకు వారి కుటుంబాలకు జీవితాంతం రుణపడి ఉంటాం.

– విరాట్‌ కోహ్లీ

మన సైనికుల పోరాటతత్వం వెలకట్టలేనిది. మీ పోరాటం వల్లే మేము భద్రంగా ఉన్నాం. మన సరిహద్దులను కాపాడుతూ మీరు చేస్తున్న పోరాటానికి బిగ్‌ సెల్యూట్‌. మీకందరికీ ధన్యవాదాలు. జైహింద్‌.

– సూర్యకుమార్‌యాదవ్‌

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సరిహద్దుల్లో పోరాడుతున్న భారత భద్రతా బలగాలను చూస్తే మనందరికీ చాలా గర్వంగా ఉంది. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుంటూ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిద్దాం.

-నీరజ్‌ చోప్రా

వీరోచిత భారత భద్రతా బలగాలను చూస్తే గర్వంగా ఉంది. మీ ధైర్యం, క్రమశిక్షణ, త్యాగం దేశానికి ఆత్మలాంటివి. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. మీ వెంట భారత్‌ ఉంది. జై హింద్‌’

– పీవీ సింధు

2025-05-09T21:24:48Z