India Vs Sri Lanka Toss and Playing 11: ఆసియా కప్ ఫైనల్ ఫైట్‌కు భారత్, శ్రీలంక జట్లు రెడీ అయ్యాయి. సూపర్-4లో పటిష్ట పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్‌కు చేరుకోగా.. చివరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసిన భారత్.. బంగ్లాదేశ్‌లో చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. సొంతగడ్డపై భారత్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకోవాలని శ్రీలంక చూస్తోంది. కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. గత మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి వచ్చారు. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ
2023-09-17T09:22:49Z dg43tfdfdgfd