IND vs SL : పొట్టి వరల్డ్ కప్ చాంపియన్‌గా టీమిండియా (Team India) టీ20 సిరీస్‌లలో పంజా విసురుతోంది. పది రోజుల క్రితమే జింబాబ్వేను చిత్తుచేసిన భారత్.. శ్రీలంక(Srilanka)ను వాళ్ల గడ్డపైనే మట్టికరిపించి పొట్టి సిరీస్ పట్టేసింది. అయితే.. నామమాత్రమైన మూడో టీ20లోనూ అతిథ్య జట్టు ఓడించేందుకు సిద్ధమైన టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు చల్లేలా ఉన్నాడు.
షెడ్యూల్ ప్రకారం మంగళవారం పల్లెకెల్ స్టేడియంలో రాత్రి 7:00 గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. అదే సమయానికి వాన పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో, రెండో టీ 20 మాదిరిగానూ ఆఖరి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించనుంది. అయితే.. పూర్తిగా 20 ఓవర్ల ఆట సాధ్యమవుతుందా? అనేది ఔట్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంది.
శ్రీలంక పర్యటనలో భారత జట్టు అదరగొడుతోంది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతం గంభీర్‌ల డైరెక్షన్‌లో వరుసగా రెండు విజయాలతో మరో మ్యాచ్ ఉండగానే పొట్టి సిరీస్ గెలుపొందింది. చివరిదైన మూడో టీ20 పల్లెకెలె స్టేడియంలో మంగళవారం రాత్రి 7:00 గంటలకు జరుగనుంది. టీ20 వరల్డ్ కప్ వైఫల్యంతో కుంగిపోయిన లంకను భారత జట్టు రెండు విజయాలతో మరింత బాధకు గురి చేసింది. అందుకని ఆఖరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చరిత అసలంక బృందం భావిస్తోంది.