IND VS ENG | రాహుల్ హాఫ్ సెంచరీ.. మూడొందల ఆధిక్యంలో భారత్

IND vs ENG :  బర్మి్ంగ్‌హమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో భారత ఓపెనర్ ప్రస్తుతం కేఎల్ రాహుల్‌ (55) క్లాస్ బ్యాటింగ్‌తో అలరించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం ముందే ఔటైన అతడు.. డ్రింక్స్ బ్రేక్ తర్వాత జోష్ టంగ్ ఓవర్లో మూడు రన్స్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. టంగ్ ఓవర్లో స్ట్రెయిట్ డ్రైవ్‌కు యత్నించిన రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 126 వద్ద టీమిండియ మూడో వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(13 నాటౌట్) క్రీజులో కుదురుకున్నాడు.  ప్రస్తుతానికి భారత్ స్కోర్.. 126/3.

ఓవర్ నైట్ స్కోర్ 64-1తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు కేఎల్ రాహుల్ మూల స్తంభంలా నిలిచాడు. ప్రత్యర్థి పేసర్ బ్రాండన్ కార్సే, క్రిస్ వోక్స్‌లు స్వింగ్ చేస్తూ వికెట్ కోసం ప్రయత్నించినా వాళ్ల వ్యూహాల్ని దెబ్బకొట్టాడీ క్లాస్ బ్యాటర్. అయితే.. క్రీజులో కుదురుకున్న కరుణ్ నాయర్(26)ను ఔట్ చేసిన కార్సే ఇంగ్లండ్‌కు తొలి బ్రేకిచ్చాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో రాహుల్ బౌండరీతో టీమిండియా ఆధిక్యం 300 దాటింది.

ఇవి కూడా చదవండి

2025-07-05T11:25:47Z