IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించిన భారత్‌కు తొలి షాక్ తగిలింది. దంచికొడుతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (28) ఔటయ్యాడు. జోష్ టంగ్ ఓవర్లో ఔండరీ బాదిన అతడు నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే.. రివ్యూ ఆలస్యంగా తీసుకోవడంతో ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ అంపైర్‌తో వాగ్వావాదానికి దిగాడు.
అయినా సరే రివ్యూను అంగీకరించిన టీవీ అంపైర్ రీప్లేలో చూడగా బంతి లెగ్‌స్టంప్‌ను తాకింది. దాంతో, 50 పరగులు భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(22), కరుణ్ నాయర్(3) క్రీజులో ఉన్నారు. భారత్ వికెట్ నష్టానికి 54 రన్స్ కొట్టిన టీమిండియా 234 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టెస్టుల్లో చెలరేగి ఆడుతున్న యశస్వీ ఈ ఫార్మాట్లో మరో రకార్డు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కార్సే ఓవర్లో బౌండరీ బాదిన అతడు అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 40వ ఇన్నింగ్స్‌లోనే యశస్వీ ఈ మైలురాయికి చేరుకున్నాడు. తద్వారా ఈ చిచ్చరపిడుగు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌ల సరసన చేరాడు. విజయ్ హజారే, గౌతం గంభీర్‌లు 43వ ఇన్నింగ్స్‌లో 2వేల క్లబ్‌లో చేరగా.. సునీల్ గవాస్కర్, సచిన్ 44 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. గంగూలీ 45వ ఇన్నింగ్స్‌లో, ఛతేశ్వర్ పూజారా 46 వ ఇన్నింగ్స్‌లో 2కే రన్స్ సాధించారు.
2025-07-04T17:25:55Z