IND vs ENG | ముంబై: స్వదేశంలో మరో ద్వైపాక్షిక సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న టీమ్‌ఇండియా.. ఇంగ్లండ్‌తో ఆదివారం జరుగబోయే చివరి టీ20లో తలపడనుంది. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి తమ ఆధిక్యాన్ని 4-1కు పెంచుకోవాలని భారత్ భావిస్తుండగా.. గత మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవడమే గాక పరువు నిలుపుకోవాలనీ బట్లర్ సేన బరిలోకి దిగనుంది.
ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత్.. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ వంటి కీలక ప్లేయర్లకు విశ్రాంతినిచ్చి బెంచ్‌ను పరీక్షించే అవకాశముంది. ఈ సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ సంజూ శాంసన్ ముంబైలో అయినా మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
2025-02-01T21:26:12Z