IND vs ENG : బర్మి్ంగ్‌హమ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో నాలుగోరోజు ఇంగ్లండ్ పేసర్ బ్రాండన్ కార్సే తొలి సెషన్‌లోనే బ్రేకిచ్చాడు. బంతి స్వింగ్ కావడంతో ప్రమాదకరంగా బౌలింగ్ చేసిన అతడు క్రీజులో కుదురుకున్న కరుణ్ నాయర్(26)ను ఔట్ చేసి జట్టులో జోష్ నింపాడు. వరుసగా రెండు ఫోర్లు బాదిన కరుణ్.. చివరి బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాలనుకున్నాడు. కానీ, అది ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ జేమీ స్మిత్ ఒడిసిపట్టుకున్నాడు. దాంతో 96 వద్ద టీమిండియా రెండో వికెట్ పడింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (41)కు జతగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(1) క్రీజులో ఉన్నాడు. ఇప్పటికైతే టీమిండియా 278 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 407కే ఆలౌట్ చేసి.. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. మూడోరోజు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(26) బౌండరీలతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ (41) తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు.
యశస్వీ ఔటయ్యాక వచ్చిన కరుణ్ నాయర్ క్రీజులో నిలవగా.. భారత్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. అయితే.. నాలుగో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లండ్ బౌలర్లు కొత్త బంతితో నాయర్, రాహుల్‌ను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా కార్సే ఫుల్ బంతులతో నాయర్‌కు సవాల్ విసిరాడు. చివరకు అతడి బౌలింగ్‌లోనే అతడు వెనుదిరిగాడు.