IND VS ENG | గిల్ రికార్డు సెంచరీ.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్..!

IND vs ENG : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలోని ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(161) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా(69 నాటౌట్), రిషభ్ పంత్(61) అర్ధ శతకాలతో విరుచుకుపడ్డారు. సెంచరీ భాగస్వామ్యాలతో జట్టుకు భాకొండంత స్కోర్ అందించాడు గిల్. క్రీజులో పాతుకుపోయిన సారథికి వైస్ కెప్టెన్ పంత్, జడ్డూలు చక్కని సహకారం అందించారు. నాలుగోరోజు ఆటకు మరో ౧18 ఓవర్లు ఉన్నాయనగా టీమిండియా 427/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆతిథ్య జట్టు ముందు 608 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది గిల్ సేన.

2025-07-05T16:10:49Z