IND VS ENG | ఇంగ్లండ్‌కు సిరాజ్ స్ట్రోక్… వందలోపే సగం వికెట్లు డౌన్

IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారీ స్కోర్‌ కొట్టిన భారత జట్టు మ్యాచ్‌పై పట్టుబిగిస్తోంది. తొలి రెండు రోజులు బ్యాటర్లు రాణించగా.. బౌలర్లు బంతితో విజృంభిస్తున్నారు. రెండో రోజు ఆఖరి సెషన్లో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ మూడోరోజు తొలి సెషన్‌లో మరింత కష్టాల్లో పడింది. సిరాజ్ ఒకే ఓవర్లో డేంజరస్ జో రూట్(22), బెన్ స్టోక్స్(0)లను ఔట్ చేసి ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు.

సిరాజ్ ధాటికి 84 కే ఐదు వికెట్లు పడిన వేళ.. హ్యారీ బ్రూక్(56 నాటౌట్), వికెట్ కీపర్ జేమీ స్మిత్‌(27 నాటౌట్)లు సమయోచితంగా ఆడుతున్నారు. ఆరో వికెట్‌కు వీళ్లు ఇప్పటికే 50 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో, ఇంగ్లండ్ స్కోర్ 130 దాటింది. అయినా ఇంకా 450 పరుగులు వెనకబడే ఉంది.

ఇవి కూడా చదవండి

2025-07-04T11:10:51Z