IND VS AUS వన్డే సిరీస్‌కి శ్రేయాస్ అయ్యర్ దూరం.. ఫీల్డింగ్ కోచ్ క్లారిటీ

భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 17 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఫస్ట్ వన్డేకి ముంబయిలోని వాంఖడే స్టేడియం శుక్రవారం ఆతిథ్యం ఇవ్వబోతోంది. అయితే.. ఈ తొలి వన్డే ముంగిట భారత్ జట్టుకి షాక్ తగిలింది. యంగ్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా వన్డే సిరీస్‌ మొత్తానికీ దూరమయ్యాడు. ఈ మేరకు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ అధికారికంగా బుధవారం ప్రకటించాడు.

ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. వెన్ను గాయంతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న శ్రేయాస్ అయ్యర్.. ఫిబ్రవరి చివర్లోనే గాయం నుంచి కోలుకుని టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. మళ్లీ గాయం తిరగబెట్టింది. దాంతో రోజుల వ్యవధిలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి శ్రేయాస్ అయ్యర్ మళ్లీ వెళ్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆ అకాడమీలో శ్రేయాస్ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు స్టార్ట్‌కాబోతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుని కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నడిపించాల్సి ఉండగా.. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఐపీఎల్ 2023 ఫస్ట్ హాఫ్ మ్యాచ్‌లకి దూరంగా ఉండే అవకాశం ఉంది. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ కూడా కొత్త కెప్టెన్ వేటలో పడింది.

2023-03-15T15:44:10Z dg43tfdfdgfd