IND VS AUS | ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన స్టార్క్.. స్కోర్ ఎంతంటే..?

IND vs AUS : టీమిండియాను ఆసీస్ స్టార్ పేస‌ర్ మిచెల్‌ స్టార్క్(Mitchell Starc) దెబ్బ కొట్టాడు. ఒకే ఓవ‌ర్‌లో రెండు కీల‌క వికెట్లు తీశాడు. ఐదో ఓవ‌ర్‌లో ఐదో బంతికి విరాట్ కోహ్లీ(4)ను స్టార్క్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఆఖ‌రి బంతికి సూర్య‌కుమార్ యాద‌వ్ (0)ను కూడా ఎల్బీగా వెన‌క్కి పంపాడు. దాంతో, 16 ర‌న్స్ వ‌ద్ద భార‌త జ‌ట్టు మూడో వికెట్ ప‌డింది. శుభ్‌మ‌న్ గిల్ (14), కేఎల్ రాహుల్ (5) క్రీజులో ఉన్నారు. ఏడు ఓవ‌ర్లు ముగిసే సరికి మూడు వికెట్ల న‌ష్టానికి 27 ర‌న్స్ చేసింది. అంత‌కుముందు ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్(3) ఔట‌య్యాడు. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 ర‌న్స్‌కు ఆలౌట్ అయింది. మిచెల్ మార్స్ హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో ఆ జ‌ట్టు మాత్రం ప‌రుగులు చేయ‌గ‌లిగింది. భార‌త పేస‌ర్లు సిరాజ్, ష‌మీ త‌లా మూడు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బ కొట్టారు.

2023-03-17T12:35:54Z dg43tfdfdgfd