దుబాయ్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్ ఓడిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)లో పాకిస్థాన్ స్థానం పడిపోయింది. షాన్ మసూద్ నేతృత్వంలోని పాక్ టెస్టు జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 8వ పొజిషన్‌లో ఉన్నది. 1965 తర్వాత ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ దారుణంగా పడిపోయింది. రావాల్పిండిలో జరిగిన తొలి టెస్టులో బంగ్లా పది వికెట్ల తేడాతో నెగ్గగా, రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై గెలుపొందింది.
బంగ్లా చేతిలో ఓటమి వల్ల పాకిస్థాన్ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు పడిపోయినట్లు ఐసీసీ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఆరో స్థానంలో ఉన్న పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో 8వ ర్యాంక్‌కు దిగజారింది. ఇక 76 రేటింగ్ పాయింట్లతో విండీస్ తర్వాత పాక్ నిలిచింది. రెండు విక్టరీలతో 13 రేటింగ్ పాయింట్లు సాధించినా.. బంగ్లాదేశ్ మాత్రం 9వ స్థానంలో కొనసాగుతోంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.