ICC AWARDS: ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ గా తొలి భారత మహిళా క్రికెటర్

ICC Awards: ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ గా తొలి భారత మహిళా క్రికెటర్

టీమిండియా స్టార్‌ మహిళా క్రికెటర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది. అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్లకే ఐసీసీ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 2022లో భారత మహిళల జట్టు తరుపున అదరగొట్టిన రేణుక.. ఐసీసీ విమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు్ గెలుచుకుంది. అయితే, ఈ అవార్డు గెలుచుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా రేణుకా సింగ్ నిలిచింది. 26 ఏళ్ల రేణుక.. 2022లో 7 వన్డేలు, 25 టీ20 మ్యాచ్ లు ఆడి 41 వికెట్లు పడగొట్టింది. ఇక ఆసీస్ ప్లేయర్ తహ్లియా మెక్‌గ్రాత్ కు ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది.

©️ VIL Media Pvt Ltd.

2023-01-26T12:47:30Z dg43tfdfdgfd