GONGADI TRISHA | ఐసీసీ అత్యుత్తమ జట్టులో త్రిష.. భారత్‌ నుంచి మరో ముగ్గురు కూడా

Gongadi Trisha | కౌలాలంపూర్‌ : రెండ్రోజుల క్రితం ముగిసిన అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండోసారి టైటిల్‌ గెలిచి రికార్డు సృష్టించిన యువ భారత జట్టు.. ఐసీసీ ప్రకటించిన ‘టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’లోనూ సత్తా చాటింది. భారత్‌ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ యువ ఆల్‌రౌండర్‌ గొంగడి త్రిషతో పాటు మరో ముగ్గురు ప్లేయర్లు జట్టులో చోటు సంపాదించారు.

ఓపెనర్‌ కమిలిని, లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు వైష్ణవి శర్మ, అయూషి శుక్లా సైతం ఫైనల్‌ లెవెన్‌లో ఉన్నారు. టోర్నీలో అత్యధిక పరుగులు (309) చేసిన త్రిష.. బౌలింగ్‌లోనూ రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అవార్డును గెలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన కైలా రెనెకె.. జట్టుకు సారథిగా ఎంపికవగా ఇంగ్లండ్‌ నుంచి ఇద్దరు, శ్రీలంక నుంచి ఇద్దరు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.

2025-02-03T22:57:09Z